‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ మార్క్ పవర్ఫుల్ లవ్ స్టోరీ.. ఘట్టమనేని జయకృష్ణ ఎంట్రీ డేట్ చూశారా?
Ghattamaneni Jaya Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, అశోక్ , మహేష్ ల తర్వాత ఘట్టమనేని కుటుంబం నుండి మరో మూడో తరం వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నారు.
‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ మార్క్ పవర్ఫుల్ లవ్ స్టోరీ.. ఘట్టమనేని జయకృష్ణ ఎంట్రీ డేట్ చూశారా?
Ghattamaneni Jaya Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, గల్లా అశోక్ , మహేష్ బాబుల తర్వాత ఘట్టమనేని కుటుంబం నుండి మరో మూడో తరం వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నారు. కీర్తిశేషులు రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి ఇంటెన్స్ ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
జూలై 9న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతిని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్డేట్ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఇంటెన్స్ లవ్ డ్రామాను 2026 జూలై 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తూ జయకృష్ణను వెండితెరకు పరిచయం చేస్తుండటం విశేషం. ఘట్టమనేని కుటుంబంతో వైజయంతీ మూవీస్‌కు దశాబ్దాల అనుబంధం ఉంది. నాడు కృష్ణతో ‘అగ్ని పర్వతం’ వంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన అశ్విని దత్.. ఆ తర్వాత మహేష్ బాబును ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా లాంచ్ చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో రమేష్ బాబు కుమారుడు జయకృష్ణను కూడా వారే ఇండస్ట్రీకి పరిచయం చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
రవీనా టాండన్ కుమార్తె టాలీవుడ్ ఎంట్రీ
చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఒక పవర్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జయకృష్ణ, రాషా థడానిల మధ్య వచ్చే లవ్ సీన్స్ , ఎమోషనల్ డ్రామా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అజయ్ భూపతి మార్క్ ఇంటెన్సిటీతో కూడిన స్క్రీన్‌ప్లే ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్
ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. మ్యూజికల్‌గా సినిమాకు ఇప్పటికే సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. విడుదల తేదీ అధికారికంగా ఖరారు కావడంతో, చిత్ర యూనిట్ రాబోయే రోజుల్లో అత్యంత భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఘట్టమనేని అభిమానులంతా జూలై 9 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




