Mahesh Babu - Prashanth Neel: ఈ ఇద్దరు కలిస్తే థియేటర్లు తగలబడిపోవడం ఖాయం
Mahesh Babu - Prashanth Neel: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం రాబోతున్నట్లు టాలీవుడ్‌లో గట్టి టాక్ వినిపిస్తోంది.
Mahesh Babu - Prashanth Neel: ఈ ఇద్దరు కలిస్తే థియేటర్లు తగలబడిపోవడం ఖాయం
Mahesh Babu: భారతీయ చలనచిత్ర రంగాన్ని మరోసారి టాలీవుడ్ వైపు తిప్పుకునేలా ఒక ఊహించని సరికొత్త క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కబోతున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందని టాక్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో ఒక అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
చిత్ర పరిశ్రమ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం... ఈ మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే విజయవంతంగా ముగిశాయని తెలుస్తోంది.ఈ ప్రాజెక్ట్ పట్ల అటు మహేష్ బాబు, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రాథమిక లైన్ ఒకే అవ్వడంతో, ప్రస్తుతం పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు వినికిడి.ప్రశాంత్ నీల్ మార్క్ హై-వోల్టేజ్ ఎలివేషన్స్, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్లకు.. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ లుక్, ఇంటెన్స్ యాక్టింగ్ తోడైతే వెండితెరపై పూనకాలేనని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో గ్లోబల్ డ్రగ్ ట్రేడ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ‘డ్రాగన్’ షూటింగ్‌తో పాటు, ప్రభాస్‌తో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్ ‘సలార్ 2’ లైన్‌లో పెట్టారు. ఈ భారీ కమిట్‌మెంట్లు అన్నీ పూర్తయిన తర్వాతే మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.
టాలీవుడ్‌కు చెందిన ఒక టాప్ నిర్మాణ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్-ఇండియా రేంజ్‌లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని ఫిలింనగర్ టాక్. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున అటు మహేష్ బాబు పిఆర్ టీమ్ గానీ, ఇటు ప్రశాంత్ నీల్ క్యాంప్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ ఇద్దరి కలయికలో సినిమా రాబోతుందనే లీక్ బయటకు వచ్చిన క్షణం నుంచే మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ రికార్డుల వేట మొదలైందంటూ అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.




