Jailer 2: జైలర్ 2 సినిమాలో ఆ బిల్డింగ్‌ను నిజంగానే పేల్చేశారా.? ఆసక్తికర విషయాలివిగో!

Jailer 2: జైలర్ 2 సినిమాలో రజినీ వెనుక బిల్డింగ్ పేలిపోయే సీన్ గ్రాఫిక్స్ కాదని, నిజంగానే పేల్చేశామని తెలిపారు.

Ravi
By Ravi
Published on: 18 Oct 2026 4:57 PM IST
Jailer 2
X

Jailer 2: జైలర్ 2 సినిమాలో ఆ బిల్డింగ్‌ను నిజంగానే పేల్చేశారా.? ఆసక్తికర విషయాలివిగో!

Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన జైలర్ 2 అక్టోబర్ 15న విడుదలై పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్లపై స్టంట్ డైరెక్టర్ చేతన్ డిసౌజా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జైలర్ 2లో రజనీ నడిచొస్తుండగా వెనకాల బిల్డింగ్ పేలిపోయే సీన్ రియల్ బ్లాస్ట్ అని స్టంట్ డైరెక్టర్ స్పష్టం చేశారు.

ప్రేక్షకులు సాధారణంగా ఇలాంటి సన్నివేశాలను గ్రాఫిక్స్ ద్వారా సృష్టిస్తారని భావిస్తుంటారు. కానీ ఈ సినిమాలో ఆ బిల్డింగ్‌ను పూర్తిగా నిజంగానే పేల్చేశామని ఆయన వెల్లడించారు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం గ్రాఫిక్స్ ద్వారా కొంచెం మాత్రమే డెవలప్ చేశామని, త్వరలో ఇందుకు సంబంధించిన మేకింగ్ షూటింగ్ వీడియో రిలీజ్ అవుతుందని ఆయన తెలిపారు.

సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్లలో కదలకుండా చేస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డైరెక్టర్ విజన్ మేరకు రియల్ లొకేషన్లలో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను అత్యంత ప్రమాదకర రీతిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

దీనికోసం టెక్నికల్ టీమ్ చాలా కష్టపడి పనిచేసిందని ఆయన తెలిపారు. ఈ సినిమా ఇప్పటికే రూ. 300 కోట్లు క్రియేట్ చేసి.. సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. తొలి రోజు నుంచే థియేటర్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.