సుప్రీం కోర్టులో నిర్మాత బండ్ల గణేష్‌కు బిగ్ షాక్ !
Bandla Ganesh: ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు అత్యున్నత న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
సుప్రీం కోర్టులో నిర్మాత బండ్ల గణేష్‌కు బిగ్ షాక్ !
Bandla Ganesh: ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు అత్యున్నత న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రుణాల చెల్లింపు వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.
రుణ వివాదం … ఆస్తి వేలం నేపథ్యం
శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్ సంస్థ తీసుకున్న భారీ రుణాలకు బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు హామీదారులుగా వ్యవహరించారు. అయితే ఆ సంస్థ గడువులోగా అప్పులు చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ రంగంలోకి దిగింది. నిబంధనల ప్రకారం సర్ఫేసీ చట్టాన్ని ఉపయోగించి 2019లో ఆయనకు చెందిన ఆస్తిని బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 2022లో ఈ ఆస్తికి బహిరంగ వేలం నిర్వహించగా, రూ. 8.51 కోట్లు సమకూరాయి. బ్యాంకు తీసుకున్న ఈ చర్యపై బండ్ల గణేష్ కుటుంబం న్యాయపోరాటం ప్రారంభించింది.
ట్రిబ్యునల్ నుంచి హైకోర్టు వరకు న్యాయపోరాటం
మొదట ఈ వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, వారికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. దీన్ని సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు, కంపెనీకి సంబంధించి ఎన్సీఎల్టీలో దివాలా పరిష్కార ప్రక్రియ నడుస్తున్నందున వ్యక్తిగత ఆస్తులను వేలం వేయడం చెల్లదని బండ్ల గణేష్ తరపున వాదించారు. అయితే ఇది కంపెనీ ఆస్తి కాదని, కేవలం గ్యారంటీ ఇచ్చిన హామీదారుల ఆస్తి మాత్రమేనని, దీనిపై ఎలాంటి నిషేధం ఉండదని బ్యాంకు స్పష్టం చేసింది. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు బ్యాంకు చర్యే సరైనదని తీర్పునిచ్చింది.
సుప్రీం కోర్టు తుది తీర్పు.. వేలం సమర్థన
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది. చట్టప్రకారమే ఆస్తి వేలం జరిగిందని తేల్చిచెబుతూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో బ్యాంకు నిర్వహించిన వేలం ప్రక్రియకు పూర్తి చట్టబద్ధత లభించినట్టయింది.




