Suriya: ఈ ఏడాది మూడు.. చేతిలో మరో మూడు.! సూర్య బిజీ బిజీ..!
Suriya: వరుస హిట్లతో సూర్య బిజీ, 'సీన్' మూవీకి U/A సర్టిఫికెట్, నవంబర్ 6న రిలీజ్, చేతిలో మరో మూడు సినిమాలు.
Suriya: ఈ ఏడాది మూడు.. చేతిలో మరో మూడు.! సూర్య బిజీ బిజీ..!
Suriya: వరుస హిట్లు, చేతి నిండా సినిమాలతో హీరో సూర్య బిజీగా ఉన్నారు. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆయన, ఇప్పుడు దీపావళికి 'సీన్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇవి కాకుండా చేతిలో మరో మూడు సినిమాలు కూడా ఉన్నాయి.
ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన 'కరుప్పు' మే 15న రిలీజైంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించారు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో మమితా బైజు, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.
'సీన్' సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వగా, రన్‌టైమ్ 2 గంటల 29 నిమిషాలుగా ఫిక్స్ అయింది. ఈ సినిమా నవంబర్ 6న దీపావళి కానుకగా వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. యాక్షన్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇందులో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌కు ఇది తమిళంలో తొలి సినిమా.
ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నస్లెన్ విలన్ పాత్రలో కనిపించనుండగా, ఆనందరాజ్, లాల్, రాజ్ ప్రియన్ ముఖ్య పాత్రల్లో ఉన్నారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు. గ్లింప్స్‌గా వచ్చిన 'రెస్పెక్టా' పాటను అరివు పాడగా, వాసి లిరిక్స్ రాశారు. సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు.
ప్రస్తుతం సూర్య జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 48వ చిత్రం చేస్తున్నారు. దీనిని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఆ తర్వాత 'మండాడి' ఫేమ్ మతిమారన్‌తో కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. ఇక ఆయన 50వ చిత్రంగా 'కరుప్పు-2' సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.




