Suriya: 'లోకీని నాకు కాల్ చేయమని చెప్పండి'.. ఫ్యాన్స్‌కు సూర్య రిక్వెస్ట్!

Suriya: 'సీన్' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రోలెక్స్ అంటూ నినాదాలు చేసిన ఫ్యాన్స్‌కు సూర్య స్పందించారు. లోకేష్‌ కనకరాజ్‌తో చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు.

Ravi
By Ravi
Published on: 3 Nov 2026 3:08 PM IST
Suriya
X

Suriya: 'లోకీని నాకు కాల్ చేయమని చెప్పండి'.. ఫ్యాన్స్‌కు సూర్య రిక్వెస్ట్!

Suriya: 'సీన్' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో సూర్యకు అభిమానులతో ఇంటరాక్షన్ జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ తెలుగు ప్రీరిలీజ్ వేడుకలో ఫ్యాన్స్ 'రోలెక్స్.. రోలెక్స్' అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన సూర్య, రోలెక్స్ గురించి చాలా ప్రాసెస్ జరుగుతోందని చెప్పారు.

'లోకీని నాకు కాల్ చేయమని చెప్పండి. వచ్చి కలవమనండి. కచ్చితంగా నిజం చేద్దాం' అని అన్నారు. హీరోగా కావాలా, విలన్‌గా కావాలా అని అభిమానులను అడగ్గా, విలన్ కావాలంటూ పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 'ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చారు, ఇప్పుడు ఒక బలమైన విలన్ కావాలి' అని సూర్య వ్యాఖ్యానించారు.

లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'విక్రమ్' మూవీలో సూర్య రోలెక్స్ పాత్రలో నటించారు. కమల్ హాసన్ హీరోగా 2022 జూన్ 3న రిలీజైన ఈ సినిమా చివర్లో సూర్య కొద్దిసేపే కనిపించినా, ఆ పాత్ర భారీ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో రోలెక్స్‌పై సెపరేట్ మూవీ చేస్తానని దర్శకుడు ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

ఇక 'సీన్' సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలోకి వస్తోంది. సూర్య 47వ చిత్రంగా జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించారు. లాల్, రాజ్ ప్రియన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు. సూర్య, జ్యోతిక నిర్మాతలు. ఈ పాత్ర కోసం నజ్రియాను మూవీ టీమ్ పలుమార్లు సంప్రదించిందని, నాలుగో ప్రయత్నంలో కథ నచ్చి ఆమె ఒప్పుకున్నారని సూర్య వెల్లడించారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.