Tamannaah: ముద్దు సీన్లపై తమన్నా షాకింగ్ కామెంట్స్.. దర్శకులు అలా చూస్తున్నారంటూ!
Tamannaah: కేవలం ఐటమ్ సాంగ్స్, గ్లామర్ పాత్రలకే పరిమితం చేయడంపై తమన్నా అసహనం.
Tamannaah: ముద్దు సీన్లపై తమన్నా షాకింగ్ కామెంట్స్.. దర్శకులు అలా చూస్తున్నారంటూ!
Tamannaah Bhatia: వెండితెరపై తన గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, ఒకవైపు హీరోయిన్‌గా అలరిస్తూనే మరోవైపు వరుస స్పెషల్ సాంగ్స్‌తో బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం వ్యన్, రేంజర్, రాగిణి-3, నో ఎంట్రీ-2, వంటి విభిన్న ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ తీరుపై, దర్శకుల ఆలోచనా విధానంపై తమన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
చాలామంది దర్శకులు తనను కేవలం ఐటమ్ సాంగ్స్ కోసమే సంప్రదిస్తున్నారని తమన్నా అసహనం వ్యక్తం చేశారు. నటిగా తనకు సవాలుతో కూడిన, పవర్‌ఫుల్ పాత్రలు చేయాలని ఎంతో ఆసక్తి ఉందని స్పష్టం చేశారు. అయితే ఇండస్ట్రీలోని కొందరు మేకర్స్ తనను కేవలం గ్లామరస్, సెక్సీ ఇమేజ్‌కే పరిమితం చేస్తున్నారని.. ఒక నటిగా తనలోని పూర్తి ప్రతిభను నిరూపించుకోవడానికి తగిన అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. తన గ్లామర్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, నటనకు ప్రాధాన్యం ఉన్న విభిన్న పాత్రలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మారిన సినిమా ట్రెండ్ గురించి కూడా తమన్నా చాలా బోల్డ్‌గా మాట్లాడారు. కథ డిమాండ్ ముఖ్య నిబంధన: కాలంతో పాటు సినిమాలు, ప్రేక్షకు అభిరుచులు మారుతున్నాయి. కథలో భాగంగా వచ్చే ముద్దు లేదా రొమాంటిక్ సన్నివేశాలను విడిగా చూపిస్తూ తప్పుగా అంచనా వేయకూడదు. కథకు అవసరమైనప్పుడు వచ్చే సన్నివేశాలను అంతే సహజంగా చూడాలని అభిప్రాయపడ్డారు. ఒక నటిగా తన ఆలోచనలను ఎంతో ధైర్యంగా, ముక్కుసూటిగా బయటపెట్టిన తమన్నా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు ఈ విషయంపై తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.




