Sidharth Malhotra: అంతటి అందగాడిని నా కెరీర్‌లో ఇప్పటి వరకు చూడలేదు!
Sidharth Malhotra: ‘ది వ్యాన్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్ మల్హోత్రాపై మిల్కీ బ్యూటీ తమన్నా ప్రశంసల వర్షం కురిపించారు.
Sidharth Malhotra: అంతటి అందగాడిని నా కెరీర్‌లో ఇప్పటి వరకు చూడలేదు!
Sidharth Malhotra: భారతీయ సినీ పరిశ్రమలో తనదైన గ్లామర్, అద్భుతమైన నటనతో రెండు దశాబ్దాలుగా కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఇటు సౌత్, అటు నార్త్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరోయిన్ తాజాగా ‘ది వ్యాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న తమన్నా తన కో-స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాపై చేసిన వ్యాఖ్యలు, అలాగే సినిమాలో ఛఠ్ పూజ పాట షూటింగ్ అనుభవాలను పంచుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్ గురించి మాట్లాడుతూ తమన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నా 20 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎంతోమంది స్టార్ హీరోలతో పనిచేశాను. కానీ, సిద్ధార్థ్ అంతటి అందమైన నటుడిని మాత్రం నేను ఇప్పటివరకు చూడలేదు. అసలు హ్యాండ్‌సమ్ అనే పదానికి నిలువెత్తు రూపం సిద్ధార్థ్ మల్హోత్రానే అంటూ అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు తమన్నా. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాలో హైలైట్ కానుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది.
ఇక ఈ చిత్రంలో బిహారీ సంస్కృతికి ప్రతీక అయిన 'ఛఠ్ పూజ' నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ గురించి మాట్లాడేటప్పుడు తమన్నా ఎమోషనల్ అయ్యారు. నేను ముంబయిలో పుట్టి పెరిగాను. అక్కడ జుహూ బీచ్‌లో వేలాది మంది మహిళలు ఛఠ్ పూజ చేయడం చాలాసార్లు చూశాను. కానీ, దాని వెనుక ఉన్న అసలు సంప్రదాయం, ఆ కష్టం నాకు సినిమా షూటింగ్ సమయంలోనే పూర్తిగా అర్థమైంది అని తెలిపారు.
దాదాపు 36 గంటల పాటు ఎలాంటి నీళ్లు కూడా ముట్టుకోకుండా, అత్యంత భక్తిశ్రద్ధలతో మహిళలు ఈ పూజలో నిమగ్నమవుతారు. ఇది బిహారీ సంస్కృతిలో ఒక అద్భుతమైన భాగం అని కొనియాడారు. సాధారణంగా మనం ఉదయించే సూర్యుడికే పూజలు చేస్తాం, కానీ ఈ పూజలో అస్తమించే సూర్యుడికి కూడా అంతే ప్రాముఖ్యతనివ్వడం విశేషమన్నారు. ఈ పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో నాలో ఏదో తెలియని అతీత శక్తి ప్రవేశించినట్లుగా, ఒక దివ్యమైన ఉద్వేగం కలిగినట్లు అనిపించేది.
నా హృదయాన్ని అత్యంత తీవ్రంగా కదిలించిన పాట ఇది" అంటూ తన అనుభవాలను పంచుకున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో తమన్నా ఆన్-స్క్రీన్ జోడీ, గ్రాండ్ మేకింగ్, డీప్ కల్చరల్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ‘ది వ్యాన్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.




