Tanikella Bharani: మోదీ చేతిని ముద్దాడాను.. నా జన్మ ధన్యం: నటుడు తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్!

Tanikella Bharani: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత నటుడు తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 11 May 2026 4:24 PM IST
Tanikella Bharani
X

Tanikella Bharani: మోదీ చేతిని ముద్దాడాను.. నా జన్మ ధన్యం: నటుడు తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్!

Tanikella Bharani: ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానిని శంషాబాద్ విమానాశ్రయంలో కలిసిన ఆయన, ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ప్రధాని మోదీతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తనికెళ్ల భరణి అత్యంత భావోద్వేగపూరితమైన సందేశాన్ని రాశారు. "నేను రాముణ్ని చూడలేదు, కృష్ణుణ్ని చూడలేదు. ఆదిశంకరుల్ని, వివేకానందుణ్ని కూడా చూడలేదు. కానీ, వారందరి అంశలతో ఉన్న మోదీ గారిని చూశాను" అంటూ ప్రధానిని మహనీయులతో పోల్చారు.

ప్రధానిని కేవలం కలవడమే కాకుండా, ఆయనను స్పర్శించడం పట్ల భరణి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఆయనను ముట్టుకున్నాను.. ఆయన చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం" అని పేర్కొంటూ తన భక్తిని చాటుకున్నారు.

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిశారు. ఈ క్రమంలోనే తనికెళ్ల భరణికి ప్రధానిని కలిసే అవకాశం దక్కింది. నిరాడంబరతకు, ఆధ్యాత్మిక చింతనకు మారుపేరైన భరణి.. మోదీని ఒక దైవ స్వరూపంగా అభివర్ణించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story