ఎట్టకేలకు ‘పెద్ది’ అఫీషియల్ జీవో వచ్చేసింది.. టికెట్ రేట్లు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం, బుకింగ్స్ షురూ!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’రిలీజ్ అప్‌డేట్స్ గుడ్ న్యూస్.
ఎట్టకేలకు ‘పెద్ది’ అఫీషియల్ జీవో వచ్చేసింది.. టికెట్ రేట్లు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం, బుకింగ్స్ షురూ!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’రిలీజ్ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టికెట్ రేట్ల పెంపు జీవో (GO)ని విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ కొత్త రేట్లను అధికారికంగా ఖరారు చేసింది. దీంతో నైజాం ఏరియాతో పాటు తెలంగాణవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి.
మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ కొత్త రేట్లు ఇవే!
ముందుగా ప్రచారంలో ఉన్న రేట్లలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్‌లలో ₹150 పెంచుతారని ప్రచారం జరగ్గా, ప్రభుత్వం ₹125 పెంపునకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దీంతో అక్కడ కొత్త టికెట్ రేటు ₹420గా మారింది. అలాగే సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై ₹100 పెంచడంతో, అక్కడ కొత్త రేటు ₹275గా ఖరారైంది. జూన్ 4న రాత్రి 8 గంటల నుండి ప్రదర్శితమయ్యే స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ ధరను గరిష్టంగా ₹600కి పరిమితం చేయగా.. ఈ పెరిగిన కొత్త ధరలన్నీ జూన్ 4 నుండి ప్రారంభమై 10 రోజుల పాటు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ జీవోలో మంచి నిర్ణయం.. కార్మికుల సంక్షేమానికి నిధులు!
ఈ టికెట్ రేట్ల పెంపు జీవోలో తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్నమైన మరియు హర్షించదగ్గ నిబంధనను విధించింది. ఈ టికెట్ రేట్ల పెంపు ద్వారా చిత్ర యూనిట్‌కు వచ్చే అదనపు రాబడిలో 20 శాతం నిధులను ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కు విరాళంగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా పరిశ్రమలోని తక్కువ ఆదాయం గల కార్మికులను ఆదుకోవడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడనుంది.
అధికారిక జీవో కాపీ బయటకు రావడంతో బుక్ మై షో, పేటీఎం వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో ‘పెద్ది’ టికెట్ బుకింగ్స్ శరవేగంగా అమ్ముడవుతున్నాయి. ఈ రేట్ల పెంపు , మెగా క్రేజ్ చూస్తుంటే మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ ఆలస్యం చేయకుండా మీ సీట్లను ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి!




