Thalapathy Vijay: త్రిష పుట్టినరోజున తేలనున్న విజయ్ రాజకీయ భవిష్యత్..

Thalapathy Vijay: తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. అదే నెల 20న విజయ్ విడాకుల కేసు విచారణకు రానుంది. త్రిష పుట్టిన రోజున ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

KVD Varma
Published on: 17 March 2026 11:41 AM IST
Thalapathy Vijay: తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి.
X

Thalapathy Vijay

Thalapathy Vijay: విజయ్ ఒక్కోసారి విధి విచిత్రంగా పరీక్ష పెడుతుంది. ఎలాంటివారికైనా తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు తలపతి విజయ్ పరిస్థితి అలానే కనిపిస్తోంది. రాజకీయాల్లో తన భవిష్యత్ ను వెతుక్కోవడం మొదలుపెట్టింది మొదలు ఎదో ఒక సమస్య ఆయనను వెంటాడుతూనే ఉంది. ఇటీవల ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కిన తరువాత ఇటు ఫిలిం వర్గాల్లోనూ.. అటు రాజకీయ వేడుకల్లోనూ ఇదో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ విషయం మీద ఎన్నో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ తో విడాకులకు కారణంగా ఒక సినీ నటి అని సంగీత తన పిటిషన్ లో పేర్కొన్నారని విషయం బయటకు రావడంతో ఆ నటి త్రిష అంటూ వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అందుకు తగ్గట్టే విజయ్, త్రిష ఇటీవల ఒక ఫంక్షన కు జంటగా హాజరయ్యారు. దీంతో అది కన్ఫామ్ అయిపోయిందటున్నారు నెటిజనం. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకూ వాళ్లిద్దరూ ఎక్కడా బయటపడలేదు.

ఇదిలా ఉంటే, తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల తేదీలను ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. తలపతి విజయ్ టీవీకే (తమిళ వెట్రి కళగం) పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు విజయ్ కి సంబంధించి ఈ తేదీ పెద్ద ప్రశ్నగా మారింది. సరిగ్గా ఈ ఎన్నికల తేదీకి ముందే విజయ్ విడాకులు తీసుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాదు.. విజయ్ రాజకీయ భవితవ్యం త్రిష పుట్టినరోజున తేలబోతోంది. ఇది కాకతాళీయమైనప్పటికీ ఇదో పెద్ద విషయంగా మారిందిప్పుడు. తమిళ రాజకీయాల్లో.. సినీ వర్గాల్లో ఈ తేదీలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలుస్తోంది.

Thalapathy Vijay: విజయ్ విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులో ఏప్రిల్ 20న విచారణకు రానుంది. కోర్టు పిటిషన్‌ను విచారించి, ఇరుపక్షాలు అంగీకరించిన తర్వాత, ఏప్రిల్ 20న విడాకులు మంజూరవుతాయా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవేళ ఆరోజు కోర్టు ఈ ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తే ఎన్నికలకు ముందు విడాకులు తీసుకున్నట్టు అవుతుంది. దీనిప్రభావం ఎన్నికలపై ఉంటుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే. అయితే, రాజకీయ వర్గాల్లో మాత్రం ఎంతో కొంత దీని ప్రభావం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ, కోర్టు విచారణ రోజున విజయ్ హాజరు కాగలరా? అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఎన్నికల ప్రచారం జోరుగా సాగే సమయం అది. ఒకవేళ ఆరోజు ఆయన హాజరు కావడం వీలుకాకపోతే విడాకుల కేసు వాయిదా పడొచ్చు.

కానీ, ఒక విషయం మాత్రం ఎవరూ తప్పించలేనిది ఉంది. ఏ త్రిష తోనైతే విజయ్ సంబంధంలో ఉన్నారని భావిస్తున్నారో ఆమె పుట్టిన రోజు మే 4. సరిగ్గా ఆరోజునే తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అంటే, విజయ్ రాజకీయ భవిష్యత్ తేలిపోయే రోజు త్రిష పుట్టిన రోజు ఒకటే.

విజయ్ అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నారు. ఆయన గెలిస్తే, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారు. ప్రస్తుతం ఆయన ఎక్కడికి వెళ్లినా చాలా మంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అది ఓట్లుగా మారుతుందా లేదా అన్నదే ప్రశ్న.

మొత్తమ్మీద విజయ్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలకు.. ఆయన రాజకీయ భవిష్యత్తుకు ముడిపెడుతూ తేదీలు నిర్ణయం అవడం మాత్రం విధి విచిత్రమే అని తమిళనాడులో సోషల్ మీడియాలో పోస్ట్స్ చక్కర్లు కొడుతున్నాయి.

KVD Varma

KVD Varma

Next Story