గద్దర్ అవార్డ్స్‌లో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అదరహో.. రెండు పురస్కారాలు కైవసం!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 2025 గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రం రెండు కీలక అవార్డులను సొంతం చేసుకుంది.

Arun Chilukuri
Published on: 22 March 2026 7:46 PM IST
Gaddar Awards
X

గద్దర్ అవార్డ్స్‌లో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అదరహో.. రెండు పురస్కారాలు కైవసం!

హైదరాబాద్: చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రం ఇప్పుడు ప్రభుత్వ పురస్కారాలను కూడా కొల్లగొట్టింది. తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ (Gaddar Film Awards) లో ఈ సినిమా రెండు అవార్డులను కైవసం చేసుకుని సత్తా చాటింది.

రెండు విభాగాల్లో అవార్డులు:

రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో, 7 పి.ఎం.ప్రొడ‌క్ష్స‌న్స్ బ్యానర్‌పై సందీప్ అగరం నిర్మించిన ఈ చిత్రానికి ఈ కింది విభాగాల్లో అవార్డులు దక్కాయి:

థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ (Third Best Feature Film)

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ (Best Child Artist): సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన మాస్టర్ రోహన్ రాయ్‌కు ఈ పురస్కారం లభించింది.

ప్రేక్షకుల మనసు గెలిచిన కథ:

గతేడాది నవంబరు 7న విడుదలైన ఈ కామెడీ డ్రామా, పల్లెటూరి నేపథ్యం మరియు చక్కటి కుటుంబ వినోదంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఇప్పుడు గద్దర్ అవార్డులు దక్కడం చిత్ర యూనిట్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

నిర్మాత సందీప్ అగరం హర్షం - కొత్త సినిమాల ప్రకటన:

అవార్డులు రావడం పట్ల నిర్మాత సందీప్ అగరం స్పందిస్తూ.. "మా చిన్న సినిమాను ‘ది గ్రేట్’ అనిపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. గద్దర్ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది" అని తెలిపారు. ఇదే ఊపులో 7 పి.ఎం.ప్రొడ‌క్ష్స‌న్స్ నుంచి ఈ ఏడాది మరో రెండు పెద్ద సినిమాలు రాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో ఒకటి టాలీవుడ్ యంగ్ హీరోతో ఉండగా, మరొకటి తమిళ హీరోతో చర్చల దశలో ఉందని వెల్లడించారు. కథా బలమే తమ ప్రొడక్షన్ బలం అని ఆయన పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story