The Prompt War - Rise of Mahaveer: పురాణాలు + ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మెంటలెక్కిస్తున్న పోస్టర్!
The Prompt War - Rise of Mahaveer: ఆర్విహా క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత నరేష్ గౌడ్, దర్శకుడు ప్రసన్న కొత్వాల కలయికలో వస్తున్న మైథో-టెక్ థ్రిల్లర్ ‘ది ప్రాంప్ట్ వార్ - రైజ్ ఆఫ్ మహావీర్’.
The Prompt War - Rise of Mahaveer: పురాణాలు + ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మెంటలెక్కిస్తున్న పోస్టర్!
The Prompt War poster: భారతీయ పురాణాలలోని అంతుచిక్కని రహస్యాలు, ఫ్యూచరిస్టిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కలయికతో వెండితెరపై ఒక అద్భుతమైన సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు 'ఆర్విహా క్రియేషన్స్' శ్రీకారం చుట్టింది. దసరా పండుగ శుభ ముహూర్తాన తమ తొలి ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్రాంప్ట్ వార్ - రైజ్ ఆఫ్ మహావీర్’ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా ప్రకటించింది. విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ‘రైజ్ ఆఫ్ మహావీర్’ అనే ఉపశీర్షిక కథలో దాగి ఉన్న శక్తివంతమైన పాత్రను, ఆ పాత్ర వెనుక ఉన్న మిస్టరీని సూచిస్తూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
మన పురాణ కాలపు కథలకు ఆధునిక సాంకేతికతను , ఫ్యూచరిస్టిక్ ఏఐ ప్రపంచాన్ని ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఇప్పటివరకు చూడని ఒక వినూత్న విజువల్ వండర్‌ను అందించబోతోంది. ఈ భారీ విజువల్ మైథో-టెక్ థ్రిల్లర్‌ను 'ఆర్విహా క్రియేషన్స్' బ్యానర్‌పై నిర్మాత నరేష్ గౌడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
నూతన దర్శకుడు ప్రసన్న కొత్వాల వినూత్నమైన ఆలోచనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జి.సి. శేఖర్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యంగ్ టాలెంట్ అంతా కలిసి పక్కా ప్రణాళికతో, గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
‘ది ప్రాంప్ట్ వార్’ చిత్రాన్ని ప పాన్-ఇండియా స్థాయిలో 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అలరించనుంది. ప్రేక్షకులకు థియేటర్లలో మరింత థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఈ చిత్రాన్ని 3D వెర్షన్‌లోనూ విడుదల చేయనున్నారు. పురాణాల దైవిక శక్తి, ఏఐ టెక్నాలజీ పోటీపడే ఈ ‘ప్రాంప్ట్ వార్’ వెండితెరపై ఎలాంటి విజువల్ వండర్స్ సృష్టిస్తుందో చూడాలి.




