Movie Releases: ఈ వారం థియేటర్లలోకి వచ్చే చిత్రాలివే.! లిస్టు సీఎం కొడుకు మూవీ..

Movie Releases: ఈ వారం పెద్ద సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

Ravi
By Ravi
Published on: 29 Sept 2026 8:59 AM IST
Movie Releases
X

Movie Releases: ఈ వారం థియేటర్లలోకి వచ్చే చిత్రాలివే.! లిస్టు సీఎం కొడుకు మూవీ.. 

Movie Releases: ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు కొత్త సినిమాలు వస్తుంటాయి. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎన్నో చిత్రాలు సిద్ధమవుతుంటాయి. ఈ వారం కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. వివిధ భాషలకు చెందిన పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాల జాబితా ప్రస్తుతం సినీ వర్గాలలో ట్రెండ్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 1న నివిన్ పౌలీ, అంజలి నటించిన 'సంచారి' సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా పలు భారీ చిత్రాలు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నాయి. ఆ వరుసలో ఆది సాయికుమార్ న నటించిన 'ఎస్ ఐ యుగంధర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంపై టాలీవుడ్ వర్గాలలో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇదే క్రమంలో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సిగ్మా' సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న 'డొంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో నిలుస్తోంది. మరోవైపు కీర్తి సురేష్ నటించిన 'డొరోథి' సినిమాతో పాటు హర్ష్ రోషన్ నటించిన 'తెల్ల కాగితం' చిత్రం కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇవి కాకుండా బాలీవుడ్ నుంచి ప్రముఖ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అయిన 'దృశ్యం 3' సినిమా కూడా ఈ వారంలోనే విడుదల కానుంది. అలాగే క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన 'తత్త్వం' సినిమా కూడా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇలా ఒకే వారం ఇన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినీ ప్రియులు ఏ సినిమా చూడాలో అని ఆలోచిస్తున్నారు. ఈ వారంలో విడుదలవుతున్న చిత్రాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందనేది త్వరలోనే తేలనుంది. థియేటర్లలో ఈ సినిమాల సందడితో బాక్సాఫీస్ కళకళలాడనుంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.