Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు లక్ష్యం సల్మాన్ ఖానేనట!

Tiger Shroff Firing Incident: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Arun Chilukuri
Published on: 21 Oct 2026 9:55 AM IST
Tiger Shroff
X

Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు లక్ష్యం సల్మాన్ ఖానేనట!

Tiger Shroff Firing Incident: బాలీవుడ్‌ యంగ్‌ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన ముంబయిలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో పోలీసులు తాజాగా వెల్లడించిన విషయాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ టైగర్‌ ష్రాఫ్‌ కాదని, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ అని పోలీసులు తేల్చారు. సల్మాన్‌ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో నిందితులు చివరి నిమిషంలో తమ ప్లాన్‌ మార్చుకుని టైగర్‌ ష్రాఫ్‌ను లక్ష్యంగా ఎంచుకున్నారు.

సోషల్‌ మీడియా రీల్స్‌ ద్వారా టైగర్‌ ష్రాఫ్‌కు పోలీసు భద్రత లేదనే విషయాన్ని గ్యాంగ్‌ గుర్తించింది. ప్రతి ఆదివారం ఆయన జుహు ప్రాంతంలోని ఫుట్‌బాల్‌ మైదానానికి వస్తుంటారనే సమాచారంతో ఈ దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సల్మాన్‌ ఖాన్‌తో సంబంధాలున్న ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేస్తామని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముంబయిలోని సల్మాన్‌ నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు.

ఈ కేసులో ఆయుధాలు సరఫరా చేసిన ఇద్దరు మహిళలతో సహా నలుగురు నిందితులను దిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. హరియాణాకు చెందిన కునాల్‌, సుమిత్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధ, బబితలను అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌సర్‌ నుంచి పిస్టల్స్ సేకరించి, రాధ సాయంతో ముంబయికి చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. అనిల్‌ పండిత్‌ ఆదేశాల మేరకే ఈ ఆయుధాల సరఫరా జరిగిందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.