Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. పోలీసుల క్లారిటీ!
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి.
Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. పోలీసుల క్లారిటీ!
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. ముంబైలోని జుహు ప్రాంతంలో ఆదివారం కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో, ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌కు గాయాలయ్యాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ప్రచారంపై ముంబై పోలీసులు స్పందించి స్పష్టత ఇచ్చారు. కాల్పుల ఘటన జరిగినప్పటికీ, టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి బుల్లెట్ గాయాలు కాలేదని వెల్లడించారు.
జుహు పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగినట్లు డీసీపీ మోహిత్ గార్గ్ ధృవీకరించారు. అయితే ఈ ఘటనకు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన గాయాలేమీ లేవని, ఆయన క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలతో ఆందోళన చెందిన అభిమానులకు కొంత ఊరట లభించింది. ధృవీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని పోలీసులు సూచించారు.
అసలు కాల్పులు ఎందుకు జరిగాయి?
జుహు ప్రాంతంలో కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఈ ఘటన వెనుక ఎవరున్నారు? అసలు లక్ష్యం ఎవరు? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాల్పులకు గల కారణాలు, నిందితుల వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, టైగర్ ష్రాఫ్‌కు గాయాలయ్యాయంటూ వస్తున్న ప్రచారాన్ని పోలీసులు ఖండించడంతో ఈ ఘటనపై నెలకొన్న గందరగోళం కొంత తగ్గింది. అయితే కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.




