Heroine: ఈడీ ముందుకు పవన్ కల్యాణ్ హీరోయిన్.. ఎందుకంటే..?

Heroine: చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హైదరాబాద్‌లోని ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

Gagan kumar
Published on: 19 Aug 2026 7:19 PM IST
Heroine
X

Heroine: ఈడీ ముందుకు పవన్ కల్యాణ్ హీరోయిన్.. ఎందుకంటే..?

Betting Apps: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ మరియు గేమింగ్ ప్రమోషన్ల వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది. చట్టవిరుద్ధమైన ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్ చేశారన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.

ఈ కేసుకు సంబంధించి ప్రముఖ నటి నిధి అగర్వాల్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో సీఐడీ విచారణను ఎదుర్కొన్న ఆమె, తాజా పరిణామాల్లో భాగంగా ఈడీ అధికారుల ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ఈ కేవలం నిధి అగర్వాల్ మాత్రమే కాకుండా, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ అగ్ర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ఈడీ కేసులు నమోదు చేసింది.

విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణిత వంటి ప్రముఖ తారలతో పాటు అనేక మంది టీవీ యాంకర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఈ వివాదంలో నిందితులుగా ఉన్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్స్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూ, అమాయక యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సైబరాబాద్ పోలీసులకు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు.. సెలబ్రిటీలు తీసుకున్న పారితోషికాలు, ఆర్థిక లావాదేవీలు , డిజిటల్ ట్రైల్స్‌పై లోతుగా ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన దర్యాప్తు సంస్థ, రానున్న రోజుల్లో మరింతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. సెలబ్రిటీల ఎండార్స్‌మెంట్‌లు యువతపై చూపుతున్న ప్రభావం, చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన అంశాలపై టాలీవుడ్‌లో ఈ పరిణామం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story