Trisha: త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాలు.. ట్రెండింగ్‌లో త్రిష.. తిరుపతిలో మొక్కులు..?

Trisha: నటి త్రిష తన 43వ పుట్టినరోజున షేర్ చేసిన 'తిరుపతి' సైన్ బోర్డ్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

Naresh.k
Published on: 4 May 2026 7:57 AM IST
Trisha
X

Trisha: త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాలు.. ట్రెండింగ్‌లో త్రిష.. తిరుపతిలో మొక్కులు..?

Thalapathy Vijay: దశాబ్దాలు దాటినా చెరగని అందం ఆమె సొంతం. సౌత్ ఇండియా క్వీన్‌గా వెలిగిపోతున్న త్రిష కృష్ణన్ ఈరోజు తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కంటే ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను తుఫాను సృష్టిస్తోంది.

తిరుపతి సైన్ బోర్డ్

త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేశారు. హైవేపై ప్రయాణిస్తుండగా తిరుపతి అని రాసి ఉన్న సైన్ బోర్డును ఆమె ఫోటో తీసి పోస్ట్ చేశారు. ఇంకేముంది.. నెటిజన్ల ఊహలకు రెక్కలొచ్చాయి.గత కొంతకాలంగా త్రిష పెళ్లిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తిరుపతి బోర్డు కనిపించడంతో.. శుభవార్త ఏమైనా చెబుతారా? పెళ్లి ఫిక్స్ అయిందా? అంటూ నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి ఆమె వెళ్తున్నారని మరికొందరు భావిస్తున్నారు.

విజయ్ గెలుపు కోసమేనా?

అయితే, త్రిష తిరుపతి ప్రయాణం వెనుక ఒక బలమైన రాజకీయ కారణం ఉందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సరిగ్గా ఈరోజే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఇవి చాలా కీలకం. విజయ్‌కు అత్యంత సన్నిహితురాలైన త్రిష.. ఆయన పార్టీ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ తిరుమల వేంకటేశ్వరుడికి మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తున్నారని ప్రచారం సాగుతోంది.

గెలిస్తే సరే.. ఓడితే ట్రోల్స్ తప్పవా..?

తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగగా, మ్యాజిక్ ఫిగర్ 118. ఒకవేళ ఫలితాలు విజయ్‌కు అనుకూలంగా వస్తే త్రిష మొక్కు ఫలించిందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కానీ, ఫలితాలు ప్రతికూలంగా వస్తే మాత్రం.. త్రిషను టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, తన 43వ ఏట కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ, వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి త్రిష ఇవ్వబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story