Trisha: విజయ్‌ని అడిగానని చెప్పండి అనగానే త్రిష రియాక్షన్ ఇదే.. వీడియో వైరల్

Trisha: సూర్య, త్రిషల తాజా చిత్రం ‘కరుప్పు’ థియేటర్ రెస్పాన్స్ కోసం చెన్నై థియేటర్‌కు వెళ్లిన త్రిషకు ఒక ఆసక్తికర సంఘటన ఎదురైంది.

Naresh.k
Published on: 16 May 2026 12:13 PM IST
Trisha
X

Trisha: విజయ్‌ని అడిగానని చెప్పండి అనగానే త్రిష రియాక్షన్ ఇదే.. వీడియో వైరల్

Trisha & విజయ్: కోలీవుడ్ స్టార్స్ సూర్య, త్రిషల క్రేజీ కాంబినేషన్‌లో దశాబ్దాల తర్వాత వచ్చిన తాజా చిత్రం ‘కరుప్పు’. శుక్రవారం (మే 15) విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ సినిమాను థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చూసేందుకు స్టార్ హీరోయిన్ త్రిష చెన్నైలోని ఒక ప్రముఖ థియేటర్‌కు వెళ్లారు. షో ముగిసిన తర్వాత ఆమె థియేటర్ నుండి బయటకు వస్తున్న సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

సూర్య సరసన త్రిష నటించిన ‘కరుప్పు’ చిత్రానికి మొదటి ఆట నుంచే అదిరిపోయే టాక్ రావడంతో, త్రిష స్వయంగా ప్రేక్షకుల రెస్పాన్స్ చూడటానికి చెన్నై థియేటర్‌కు విచ్చేశారు. థియేటర్‌లో త్రిషను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఈలలు, కేకలతో థియేటర్ మొత్తాన్ని హోరెత్తించారు. సినిమా పూర్తయ్యాక ఆమె తన కారు వైపు వెళ్తుండగా, అభిమానులు, మీడియా ప్రతినిధులు ఆమెను చూడటానికి, ఫొటోలు తీసుకోవడానికి పెద్ద ఎత్తున చుట్టుముట్టారు.

త్రిష బాడీగార్డ్స్ రక్షణ నడుమ కారు ఎక్కుతున్న సమయంలో.. గుంపులో ఉన్న ఒక వీరాభిమాని గట్టిగా అరుస్తూ, మేడమ్.. మా దళపతి విజయ్‌ని అడిగానని చెప్పండి అంటూ గట్టిగా అరిశాడు. ఆ మాట వినగానే కారులో కూర్చున్న త్రిష ఒక్కసారిగా తిరిగి, ఆ అభిమాని వైపు చూస్తూ ముఖంపై అందమైన చిరునవ్వులు చిందించారు. సదరు అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఎలాంటి అసహనం ప్రదర్శించకుండా, ఎంతో కూల్‌గా నవ్వుతూ స్పందించిన తీరు అక్కడున్న వారిని ఫిదా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్, త్రిషలది ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్. ‘గిల్లి’, ‘తిరుపాచి’ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరూ ఇటీవల ‘లియో’ , ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాల్లో కలిసి కనిపించి మెప్పించారు. ఇలాంటి తరుణంలో విజయ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన త్రిషకు, విజయ్ గురించి థియేటర్ దగ్గర ప్రశ్న ఎదురవ్వడం.. దానికి ఆమె నవ్వుతూ రియాక్ట్ అవ్వడం దళపతి అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story