Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌కు నెగిటివ్ టాక్..నాకు ఇదే వచ్చు.. ఇలాగే తీస్తా హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై వస్తున్న నెగిటివ్ టాక్,విమర్శలకు డై రెక్టర్ హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Naresh.k
Published on: 20 March 2026 8:13 AM IST
Ustaad Bhagat Singh
X

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌కు నెగిటివ్ టాక్..నాకు ఇదే వచ్చు.. ఇలాగే తీస్తా హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావాల్సిందే. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఉగాది పర్వదినం సందర్భంగా (మార్చి 19, 2026) విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పుడు థియేటర్లలో రచ్చ చేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా అంచనాలు అందుకోలేకపోయిందని అభిమానులే పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా ఫలితం , దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ - హరీష్ కలయికలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, రిలీజ్‌కు ముందు 'ఓజీ' లాంటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై బజ్ కొంత తక్కువగానే కనిపించింది. కానీ, థియేటర్లలో బొమ్మ పడ్డాక సీన్ మారిపోయింది.

సక్సెస్ మీట్‌లో హరీష్ మార్క్ స్పీచ్

సినిమా విడుదలైన కొన్ని గంటలకే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఎప్పటిలాగే తనదైన శైలిలో మాట్లాడిన హరీష్ శంకర్, విమర్శకులకు, ఆడియన్స్‌కు సూటిగా సమాధానమిచ్చారు.నేను ఎప్పుడూ ఒక కళాఖండాన్ని తీస్తానని చెప్పలేదు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తానని చెప్పాను, అదే చేశాను. ఒకవేళ నా నుంచి అద్భుతమైన కళాఖండాన్ని ఆశించి ఉంటే క్షమించండి.. నాకు ఇలాంటి సినిమాలే వచ్చు, ఇలాగే తీస్తాను అని కుండబద్దలు కొట్టారు.

వింటేజ్ స్వాగ్.. సమకాలీన సమస్యలు

పవన్ కళ్యాణ్ ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ , వింటేజ్ మాస్ మేనరిజమ్స్ ఈ సినిమాలో హైలైట్ అని హరీష్ పేర్కొన్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఆధార్ కార్డుల మిస్సింగ్ వంటి తీవ్రమైన సామాజిక అంశాలను టచ్ చేశామని వివరించారు.

లో ఉంటేనే హై తెలుస్తుంది

ఫస్టాఫ్ స్లోగా ఉందన్న విమర్శలపై స్పందిస్తూ.. చీకటి ఉన్నప్పుడే పగటి అందం తెలుస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేయడానికి కొంత సమయం పడుతుంది, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఆగదు అని తన మేకింగ్ స్టైల్‌ను సమర్థించుకున్నారు. కంటెంట్ సిద్ధం కావడానికి సమయం పట్టడం వల్లే ప్రమోషన్స్‌లో సెకండాఫ్ గురించి ముందే చెప్పలేకపోయామని వెల్లడించారు. మొత్తానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ సత్తా చాటుతోంది. అంచనాలు తక్కువగా ఉన్నా, థియేటర్లలో మాస్ ఆడియన్స్‌ను అలరించడంలో హరీష్ శంకర్ తన మార్క్ చూపించారు.

Naresh.k

Naresh.k

Next Story