Vadde Naveen: సినిమాలు మానేశానని చిరంజీవి ఏమన్నారంటే.? వడ్డే నవీన్ షాకింగ్ కామెంట్స్..

Vadde Naveen: దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత 'త్రిమూర్తులు' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటుడు వడ్డే నవీన్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Ravi
By Ravi
Published on: 29 July 2026 9:32 PM IST
Vadde Naveen
X

Vadde Naveen: సినిమాలు మానేశానని చిరంజీవి ఏమన్నారంటే.? వడ్డే నవీన్ షాకింగ్ కామెంట్స్.. 

Vadde Naveen: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న నటుడు వడ్డే నవీన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చారు. ఆయన నటించిన తాజా చిత్రం 'త్రిమూర్తులు' ఇటీవల విడుదలై మంచి టాక్ సంపాదించింది. ఇటీవల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నవీన్ మాట్లాడుతూ, తాను 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకులు, మీడియా తనను ఎప్పుడూ గుర్తుంచుకోవడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ అభిమానమే తనను మళ్లీ ఇండస్ట్రీ వైపు అడుగులేసేలా చేసిందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తాను సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆరా తీశారని నవీన్ తెలిపారు. చిరంజీవి తనను ఒక సోదరుడిలా భావిస్తారని, తాను సినిమాలు ఎందుకు చేయట్లేదో తెలుసుకుని ఎంతో బాధపడ్డారని నవీన్ గుర్తుచేసుకున్నారు. ఆ అభిమానమే తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని వెల్లడించారు. కెరీర్ తొలినాళ్లలో 'పెళ్లి' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించిన అనుభవాలను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.

ఆ సినిమాలో క్లైమాక్స్ మొత్తం సీనియర్ నటి సుజాత పాత్ర చుట్టే తిరుగుతుందని, ఒక మంచి సినిమాకు హీరో పాత్ర కంటే కథ, క్యారెక్టరైజేషన్ చాలా ముఖ్యమని తాను అప్పుడే నమ్మానని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొన్ని రొటీన్ కథలు రావడంతో, ప్రేక్షకులను పదేపదే నిరాశపరచడం ఇష్టం లేక, అలాగే నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే తాను ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని వడ్డే నవీన్ భావోద్వేగంతో వివరించారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story