Box Office: అన్న మన సినిమాకు టీ ఖర్చులు కూడా రాలేదు!

Box Office: టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ నటించి, నిర్మించిన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Naresh.k
Updated on: 26 Jun 2026 8:23 AM IST
Box Office
X

Box Office: అన్న మన సినిమాకు టీ ఖర్చులు కూడా రాలేదు!

Vadde Naveen: నైంటీస్ కిడ్స్‌కు వడ్డే నవీన్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్. 'పెళ్లి', 'మనసిచ్చి చూడు' వంటి క్లాసిక్ హిట్స్‌తో అప్పట్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు విపరీతంగా దగ్గరైన వడ్డే నవీన్.. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేశారు. ఆయన స్వయంగా నిర్మించి, నటించిన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమా ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆశించిన స్థాయిలో నవీన్‌కు కలిసి రాలేదనే చెప్పాలి.

1997లో ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్.. ఆ వెంటనే వచ్చిన ‘పెళ్లి’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశారు. లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్. ఆ సినిమాలో నవీన్ చూపించిన అమాయకత్వం, నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘ప్రియరాగాలు’, ‘మనసిచ్చి చూడు’, ‘తాంబూలాలు’, ‘చాలా బాగుంది’ వంటి వరుస విజయాలతో దూసుకుపోయారు. అయితే ఆ తర్వాత కాలం కలిసిరాక.. 2005లో వచ్చిన ‘అయోధ్య’ చిత్రం తర్వాత ఆయన వెండితెరకు దాదాపు దూరమయ్యారు.

చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ పూర్తి నమ్మకంతో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి నవీన్ స్వయంగా నిర్మాతగా వ్యవహరించడం విశేషం. దాదాపు 7 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అయితే, గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ రేసులో వెనుకబడిపోయింది.

ఈ సినిమాలో వడ్డే నవీన్ నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. పాత నవీన్‌ను మళ్లీ స్క్రీన్‌పై చూడటం బాగుందని ఫ్యాన్స్ మురిసిపోయారు. కానీ, దర్శకుడు ఎంచుకున్న కథ, కథనం పాత ఫార్మాట్‌లో ఉండటం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. నేటితరం ఆడియెన్స్ పల్స్ అందుకోవడంలో కథనం విఫలం కావడంతో థియేటర్లు వెలవెలబోయాయి.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న గట్టి పోటీని తట్టుకోవడంలో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ విఫలమైంది. అదే సమయంలో రిలీజైన ‘మా ఇంటి బంగారం’, ‘దీవానా’ సినిమాలు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండటంతో నవీన్ సినిమాను థియేటర్లలో పట్టించుకునే వారే కరువయ్యారు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం రూ.25 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. నవీన్ నటుడిగా మెప్పించినా, నిర్మాతగా మాత్రం ఆయనకు ఈ రీ-ఎంట్రీ భారీ నష్టాలనే మిగిల్చినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఏదేమైనా వడ్డే నవీన్ లాంటి టాలెంటెడ్ హీరో.. నెక్స్ట్ టైం అయినా మంచి కంటెంట్‌తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story