'Vadhala' Trailer: భయపెడుతున్న జగపతి బాబు, లయల సస్పెన్స్ థ్రిల్లర్ 'వదల' ట్రైలర్!
'Vadhala' Trailer: సీనియర్ స్టార్ జగపతి బాబు ప్రధాన పాత్రలో వస్తున్న సైకో థ్రిల్లర్ 'వదల'. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
'Vadhala' Trailer: భయపెడుతున్న జగపతి బాబు, లయల సస్పెన్స్ థ్రిల్లర్ 'వదల' ట్రైలర్!
'Vadhala' Trailer: సీనియర్ స్టార్ జగపతి బాబు ప్రధాన పాత్రలో వస్తున్న సైకో థ్రిల్లర్ 'వదల'. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక సామాన్యమైన కుటుంబ యజమాని జీవితంలోకి ఒక యువతి ప్రవేశించి, ఆ కుటుంబాన్ని ఎలా అతలాకుతలం చేసిందనే ఆసక్తికరమైన పాయింట్‌తో ట్రైలర్ సాగింది. జూలై 17న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
కథలోకి వెళ్తే.
ఈ సినిమాలో యోగి అనే ఒక మంచి కుటుంబ యజమాని పాత్రలో జగపతి బాబు కనిపించబోతున్నారు. తన భార్య (లయ)తో హాయిగా సాగిపోతున్న ఆయన జీవితంలోకి, పక్కింటి యువతి (హృతిక శ్రీనివాస్) రాకతో ఊహించని చిక్కులు మొదలవుతాయి. ఆ యువతికి యోగి అంటే పిచ్చి ప్రేమ. ఆ వ్యామోహం కాస్తా వికృత రూపం దాల్చి, యోగి భార్యకు ఫోన్లు చేస్తూ తన భర్తను వదిలేయమని బెదిరించడం ట్రైలర్లో చాలా థ్రిల్లింగ్‌గా చూపించారు. అసలు ఆ యువతి లక్ష్యం ఏంటి? యోగి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ
ఎవరెవరు ఏ పాత్రలో?
జగపతి బాబు, లయ తమ పాత్రల్లో చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో హృతిక శ్రీనివాస్ నటన ట్రైలర్‌కే హైలైట్ అని చెప్పాలి. ఆమె అభినయం చూస్తుంటే, సినిమా మొత్తం చాలా ఎమోషనల్ గా, మిస్టరీగా ఉండబోతోందని అర్థమవుతోంది. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ కలిసి నిర్మిస్తున్నారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
ట్రైలర్ చూస్తుంటే టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా అనిపిస్తోంది. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ థ్రిల్లర్ కు కావాల్సిన భయాన్ని, మూడ్ ని బాగా క్రియేట్ చేసింది. కార్తీక్ కొడకండ్ల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే థ్రిల్లింగ్ గా ఉంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ తో ట్రైలర్ చాలా వేగంగా, ఆసక్తికరంగా సాగింది. లక్ష్మీ భూపాల రాసిన సంభాషణలు కథకు బలాన్నిచ్చాయి. మొత్తానికి, 'వదల' జూలై 17న మంచి థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇవ్వడం ఖాయమనిపిస్తోంది. జగపతి బాబు గారితో పాటు లయను మళ్ళీ వెండితెరపై చూడటం ఫ్యాన్స్ కు పండగే!




