Varanasi: రూ. 290 కోట్లకు తెలుగు థియేట్రికల్ రైట్స్.. RRR రికార్డు బ్రేక్.!

Varanasi: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' థియేట్రికల్ రైట్స్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోసం రూ. 290 కోట్లకు మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది, ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

Ravi
By Ravi
Published on: 10 Nov 2026 1:35 PM IST
Varanasi
X

Varanasi: రూ. 290 కోట్లకు తెలుగు థియేట్రికల్ రైట్స్.. RRR రికార్డు బ్రేక్.!

Varanasi: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' విడుదలకు ముందే భారీ బిజినెస్‌తో వార్తల్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కోసం రూ. 290 కోట్ల డీల్ కుదిరినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. రాజమౌళి గత చిత్రం 'RRR' థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 225 కోట్లకు అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


రూ. 290 కోట్లు నిజమైతే 'RRR' రికార్డును రూ. 65 కోట్లు దాటినట్లే. అంటే 'RRR' కంటే సుమారు 29 శాతం ఎక్కువ ధర పలికింది. మైత్రితో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఈ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. చివరికి మైత్రి భారీ ఆఫర్‌తో ముందంజలో నిలిచింది. ఈ రూ. 290 కోట్ల లావాదేవీపై చిత్ర నిర్మాణ సంస్థ గానీ, మైత్రి మూవీ మేకర్స్ గానీ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.


మహేష్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తున్న ఈ ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ఫిల్మ్‌లో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్న 'వారణాసి' 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.