వెంకీ మామ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ ప్రచారాలు షురూ..
Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ డ్రామా ‘ఆదర్శ కుటుంబం’.
వెంకీ మామ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ ప్రచారాలు షురూ..
Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ డ్రామా ‘ఆదర్శ కుటుంబం’. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ అధికారికంగా ప్రారంభించారు.
సోమవారం నుంచి పాత్రల పరిచయం.. ‘చిట్టిబాబు’గా వెంకటేష్!
సినిమా ప్రచారంలో భాగంగా మేకర్స్ తాజాగా ఒక బ్రాండ్-న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. రేపు (సోమవారం) నుంచి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో భాగంగా మొదటగా హీరో వెంకటేష్ పాత్రను రివీల్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఆయన 'చిట్టిబాబు' అనే పాత్రలో కనిపించనున్నారు. అలాగే శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ తదితరులు హీరో కుటుంబ సభ్యులుగా కనిపించనున్నారు.
భారీ తారాగణం , సాంకేతిక నిపుణులు
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' పూర్తి టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.




