Nana Patekar: నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు జరిగాయి? క్లారిటీ ఇచ్చిన కుమారుడు

Nana Patekar: దివంగత నటుడు నానా పటేకర్ అంత్యక్రియలు రాత్రివేళ జరగడంపై వస్తున్న విమర్శలపై కుమారుడు మల్హర్ పటేకర్ స్పందించారు.

Arun Chilukuri
Published on: 9 Oct 2026 12:10 PM IST
Nana Patekar
X

Nana Patekar: నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు జరిగాయి? క్లారిటీ ఇచ్చిన కుమారుడు

Nana Patekar: ప్రముఖ నటుడు నానా పటేకర్ పార్థివ దేహానికి గురువారం రాత్రి పుణెలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన కుమారుడు మల్హర్ పటేకర్ ఈ అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. అయితే అర్ధరాత్రి వేళ అంత్యక్రియలు నిర్వహించడంపై కొందరు విమర్శలు వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై నానా పటేకర్ కుమారుడు మల్హర్ పటేకర్ స్పందిస్తూ స్పష్టతనిచ్చారు.

గోవా నుంచి నానా పటేకర్ భౌతికకాయాన్ని పుణెలోని ఫామ్‌హౌస్‌కు తీసుకురావడంలో ప్రయాణ కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందని మల్హర్ తెలిపారు. ముందుగా అనుకున్న సమయానికి చేరుకుంటామని భావించినప్పటికీ, రవాణా మరియు ఇతర కారణాల వల్ల సమయం పట్టిందని చెప్పారు.

"గురువారం తెల్లవారుజామున నాన్న కన్నుమూశారు. అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. మరుసటి రోజు వరకు ఉంచడం కంటే, వీలైనంత త్వరగా అదే రోజు అంత్యక్రియలు పూర్తి చేయాలని కుటుంబసభ్యులంతా నిర్ణయించుకున్నాం" అని మల్హర్ వివరించారు.

తండ్రి మరణం తర్వాత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రథమ బాధ్యతని మల్హర్ పేర్కొన్నారు. నానా పటేకర్ స్థాపించిన 'నామ్ ఫౌండేషన్' (Naam Foundation) ద్వారా రైతుల కోసం, సమాజం కోసం చేపట్టిన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.

"మా నాన్నలాంటి గొప్ప వ్యక్తులు తాము చేసిన మంచి పనుల ద్వారా చిరంజీవులుగా నిలిచిపోతారు, వారికి మరణం ఉండదు. నాన్న మరణించడానికి ముందే ప్రతి ఒక్కరికీ కొన్ని బాధ్యతలు అప్పగించి వెళ్లారు" అంటూ మల్హర్ భావోద్వేగానికి గురయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.