Vihari OTT: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ.. జూన్ నుండి ప్రసారాలు!

Vihari OTT: తెలుగు డిజిటల్ మీడియా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ‘విహారి OTT’ సిద్ధమైంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదుగా దీని గ్లోబల్ విజన్‌ను ఆవిష్కరించారు.

Arun Chilukuri
Published on: 26 May 2026 10:41 AM IST
Vihari OTT
X

Vihari OTT: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ.. జూన్ నుండి ప్రసారాలు!

Vihari OTT: తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలుగులో మొట్టమొదటి పూర్తిస్థాయి ట్రావెల్ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ ‘విహారి OTT’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ (Cannes Film Festival) వేదికగా ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన గ్లోబల్ విజన్‌ను ఘనంగా ఆవిష్కరించారు.

ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' ఫేమ్, నటి శ్రీ సత్య చేతుల మీదుగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ లోగో, పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో విహారి OTT బృందం ఒక ప్రత్యేక ప్రివ్యూను కూడా ప్రదర్శించింది. అంతర్జాతీయ వేదికపై తెలుగు సంస్కృతి, పర్యాటక రంగాల కలయికతో రూపొందుతున్న ఈ ప్లాట్‌ఫామ్ ఆవిష్కృతం కావడం విశేషం.

గడిచిన 18 ఏళ్లుగా బుల్లితెరపై వైవిధ్యమైన ట్రావెల్ కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ‘విహారి’ గ్రూప్, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విప్లవానికి తెరలేపింది. తెలుగు మీడియాలోనే ట్రావెల్ షోలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విహారి.. ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక రుచులు, జీవన శైలిని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వస్తోంది.

ఇప్పటివరకు టెలివిజన్ ద్వారా కోట్లాది మందికి అద్భుతమైన ప్రయాణ కథనాలను అందించిన విహారి, ఇకపై గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ OTT రూపంలో మరింత విస్తృతంగా కంటెంట్‌ను అందించనుంది. కేవలం ట్రావెల్, టూరిజం అంశాలకు మాత్రమే అంకితమైన తెలుగు భాషా తొలి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా 'విహారి OTT' జూన్ నెలలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచాన్ని తెలుగు వారి ఇళ్లల్లోకి తీసుకురాబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story