Vijay Deverakonda: ఈ బ్రతుకు వేస్ట్.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!
Vijay Deverakonda: 'రోమాంచకం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ భావోద్వేగంగా మాట్లాడారు.
Vijay Deverakonda: ఈ బ్రతుకు వేస్ట్.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!
Sandeep Reddy: సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన లేటెస్ట్ చిత్రం 'రోమాంచకం'. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడిన భావోద్వేగపూరిత మాటలు వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సందీప్ రెడ్డి వంగాతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. మాది కేవలం హీరో-డైరెక్టర్ బంధం కాదు, సోదరులైనా, స్నేహితులైనా అంతకంటే ఎక్కువే. 'అర్జున్ రెడ్డి' సమయంలో మేమొక యుద్ధమే చేశాం. అప్పట్లో మా దగ్గర డబ్బులు, పేరు, ఇన్ఫ్లుయెన్స్ ఏవీ లేవు. సందీప్ వాళ్ల కుటుంబం తమ పొలాన్ని అమ్మేసి నన్ను నమ్మి ఆ సినిమా తీశారు. నాకోసం సందీప్, సందీప్ కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తాం. సందీప్ పిలిస్తే ఈ ఈవెంట్‌కు రాకపోతే నా బతుకు వేస్ట్ అని విజయ్ తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
హీరో సుమంత్ ప్రభాస్ పట్ల ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. సుమంత్ కళ్లలో సినిమా పట్ల ఉన్న తపన చూసి ‘మేమ్ ఫేమస్’ సమయం నుంచే ప్రోత్సహిస్తున్నా. విజయం ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. నీపై నీకు నమ్మకం ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. ఏ వేడుకలోనైనా నీకు ఎవరూ తెలియకపోయినా నా పక్కన వచ్చి కూర్చో, నేనున్నానంటే నీకొకరు తోడున్నట్లే అని భరోసానిచ్చారు.
జీవితంలోని ప్రతి ఘట్టాన్ని ఆస్వాదించాలని చెబుతూ.. జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, లవ్‌లో పడినా, హార్ట్ బ్రేక్ అయినా, పెళ్లి చేసుకున్నా.. ఏది చేసినా జీవితంలో ఒక 'రోమాంచకమే' అని సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల గాయపడిన తన భార్య రష్మిక ఆరోగ్యం గురించి స్పందిస్తూ.. రష్మిక బానే ఉంది, ఇంజ్యూరీ నుంచి వేగంగా కోలుకుంటోందని అభిమానులకు సమాచారం అందించారు. భద్రకాళీ పిక్చర్స్ నిర్మించిన ఈ 'రోమాంచకం' చిత్రం సెప్టెంబర్ 2న జరిగే ప్రీమియర్స్ నుంచే పెద్ద సక్సెస్ సాధించాలని విజయ్ ఆకాంక్షించారు.




