Vijay Deverakonda: వాళ్లే డబ్బులిచ్చి నాపై నెగెటివిటీని క్రియేట్ చేయిస్తున్నారు
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన 'రణబాలి' అక్టోబర్ 16న విడుదల కానుంది.
Vijay Deverakonda: వాళ్లే డబ్బులిచ్చి నాపై నెగెటివిటీని క్రియేట్ చేయిస్తున్నారు
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా పీరియడ్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హైదరాబాద్ లో ఘనంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై సినిమా విశేషాలతో పాటు తనపై వస్తున్న సోషల్ మీడియా నెగెటివిటీపై విజయ్ దేవరకొండ ఎమోషనల్ గా, అదే సమయంలో చాలా బోల్డ్ గా స్పందించారు.
ఈ సినిమా గురించి విజయ్ మాట్లాడుతూ.. మనకు ఏ చరిత్ర తెలియకుండా దాచారో, ఏ వీరుల చరిత్ర తెలియకూడదు అనుకున్నారో, ఆ చరిత్రను సరిదిద్దే ప్రయత్నమే 'రణబాలి'. కరువు అనే పాయింట్ ను మన కల్చర్ నుంచి, ఒక మాసీ హీరోయిక్ బ్యాక్ డ్రాప్ లో రాహుల్ సంకృత్యన్ అద్భుతంగా తెరకెక్కించారు. నా కెరీర్ లోనే ఇది ఒక పెద్ద హైలైట్ గా నిలిచిపోతుంది. అక్టోబర్ 16న మీ కుటుంబంతో కలిసి థియేటర్లలో ఈ సినిమా చూసి, మన పూర్వీకుల డీఎన్ఏ ఏంటో తెలుసుకోండి అని పిలుపునిచ్చారు. రష్మిక ఈ ఈవెంట్ కు రాలేకపోవడానికి కారణం చెప్పి ఆమె తరఫున అందరికీ క్షమాపణలు కూడా తెలిపారు.
ఇదే వేదికపై సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ , నెగెటివిటీ గురించి విజయ్ మాట్లాడుతూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. నా కలలు, నా శ్రమ వాళ్లకు అనవసరం అనిపిస్తే నేను ఆగాలా? నా ఆత్మవిశ్వాసం వాళ్లకు బలుపు అనిపిస్తే నేను తగ్గాలా? నేను మారను.. వాళ్లు మారాలి అంటూ తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ అంతా ఆర్గానిక్ హేట్ కాదని, కొందరు వ్యక్తులు గ్రూప్ లుగా ఏర్పడి, డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి నెగెటివిటీని క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. 'రణబాలి' సినిమాను కూడా కావాలనే టార్గెట్ చేసి కొన్ని రీల్స్ ట్రెండ్ చేస్తున్నారని, సిస్టమే ఇలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ వరకూ అందరినీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చివరికి అక్టోబర్ 2న మహాత్మా గాంధీని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక మా లాంటి నటులు వీటికి ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు అని నవ్వుతూ కొట్టిపారేశారు. ఒక నటుడి కెరీర్ ను కేవలం ఒక ప్లాప్ కాదు కదా, ఏకంగా 20 ప్లాపులు వచ్చినా డిసైడ్ చేయలేవని స్పష్టం చేశారు. నెగెటివిటీని స్ప్రెడ్ చేసేవారు ఆ సమయాన్ని తమ జీవితాలను బాగుచేసుకోవడానికి ఉపయోగించుకోవాలని హితవు పలికారు.
మొత్తానికి, 'రణబాలి' సినిమాతో ఒక అద్భుతమైన చారిత్రాత్మక విజయాన్ని అందించేందుకు సిద్ధమవుతున్న విజయ్ దేవరకొండ, విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతామని ఈ ఈవెంట్ ద్వారా మరోసారి నిరూపించారు.




