Vijay Divorce Case: నటుడు విజయ్ విడాకుల కేసులో కోర్టు కీలక ఆదేశం!

Vijay Divorce Case: తమిళ సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న నటుడు విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు క్లిష్ట దశకు చేరుకుంది.

Srinivas Rao
Published on: 20 April 2026 2:53 PM IST
Vijay Divorce Case: నటుడు విజయ్ విడాకుల కేసులో కోర్టు కీలక ఆదేశం!
X

Vijay Divorce Case: తమిళ సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న నటుడు విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు క్లిష్ట దశకు చేరుకుంది. తన భార్య సంగీత నుంచి విడాకులు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చెంగల్పట్టు కోర్టు నేడు కీలక విచారణ జరిపింది. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతుండటంతో అటు అభిమానుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

విచారణ జూన్ 15కు వాయిదా

చెంగల్పట్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో నేడు విజయ్‌, సంగీత విడాకుల కేసు విచారణకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను జూన్‌ 15వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈసారి విచారణకు ఇద్దరూ ఖచ్చితంగా హాజరుకావాలని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, కోర్టు ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వీడియో కాన్ఫరెన్స్‌కు కోర్టు నో

విజయ్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పనుల్లోనూ, తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రచార కార్యక్రమాల్లోనూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ కారణం చేత ఆయన నేరుగా కోర్టుకు హాజరుకావడం కష్టమని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని విజయ్ తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చినట్లు సమాచారం. రాజకీయ పనులు ఉన్నప్పటికీ, చట్టం ముందు అందరూ సమానమేనని భావిస్తూ, జూన్ 15న విజయ్ వ్యక్తిగతంగా కోర్టు గడప తొక్కాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు.

భారీ భరణం డిమాండ్?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సంగీత తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుమారు రూ. 250 కోట్ల భారీ మొత్తాన్ని భరణంగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తుల వివరాల ఆధారంగా ఆమె ఈ డిమాండ్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ మాత్రం రూ. 35 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పిల్లల బాధ్యతలను పూర్తిగా తానే చూసుకుంటానని కోర్టుకు తెలిపినట్లు సమాచారం. ఈ భారీ వ్యత్యాసం కారణంగానే చర్చలు కొలిక్కి రావడం లేదు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story