'సింహాద్రి' మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఆమె ఏం చేస్తోందంటే..

Ankitha: 'సింహాద్రి' సినిమాతో ఎంతో మందిని అలరించిన హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది?

Ravi
By Ravi
Published on: 27 May 2026 11:02 AM IST
Ankitha
X

'సింహాద్రి' మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఆమె ఏం చేస్తోందంటే..

Ankitha: ఒకప్పుడు టాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి అంకిత. ఎన్టీఆర్ సరసన 'సింహాద్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ సినిమా తర్వాత ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చింది. ఆపై 'లహరి లహరి లహరిలో', 'విజయదశమి' లాంటి పలు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే, కొన్ని సంవత్సరాల క్రితమే అంకిత నటనకు స్వస్తి పలికి వెండితెరకు దూరమయ్యారు. ఆమె ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నారు. కొంతకాలం క్రితం ఆమె వివాహం చేసుకుని, ప్రస్తుతం అమెరికాలో తన కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. రస్నా యాడ్ ద్వారా బుల్లితెరపై కనిపించిన ఈమె.. ఇప్పుడు కెమెరాలకు, గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటూ, తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న అంకిత, ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడైనా కనిపిస్తే, అభిమానులు ఆమెను గుర్తుపట్టలేనంతగా మారిపోయారని ఆశ్చర్యపోతుంటారు.

ఇక ఇవాళ మే 27న హీరోయిన్ అంకిత పుట్టినరోజు కావడంతో తన ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు.. సో.! హ్యాపీ బర్త్ డే అంకిత.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story