Sathvika Veeravalli: అల్లు అరవింద్ మనసు దోచుకున్న ఆ యంగ్ బ్యూటీ ఎవరు..?

Sathvika Veeravalli: దుల్కర్ సల్మాన్ సరసన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో నటిస్తున్న సాత్విక వీర్నవల్లికి తొలి సినిమా రిలీజ్ కాకముందే అల్లు అరవింద్ మరో రెండు సినిమాల ఆఫర్లు ఇచ్చారు.

Gagan kumar
Published on: 16 Nov 2026 2:34 PM IST
Sathvika Veeravalli
X

Sathvika Veeravalli: అల్లు అరవింద్ మనసు దోచుకున్న ఆ యంగ్ బ్యూటీ ఎవరు..?

Allu Aravind: టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు తమ మొదటి సినిమా విడుదలయ్యే వరకు అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అరుదుగా కొందరు మాత్రమే తొలి సినిమా థియేటర్లలోకి రాకముందే తమ టాలెంట్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి క్రేజ్‌నే సొంతం చేసుకుంటోంది యంగ్ బ్యూటీ సాత్విక వీర్నవల్లి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు, సినిమా రిలీజ్‌కు ముందే ఏకంగా మరో రెండు భారీ ప్రాజెక్టులకు సంతకం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇటీవల జరిగిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సాత్విక గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కోసం మొదట ఒక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని భావించామని ఆయన తెలిపారు. అయితే సాత్విక ఇచ్చిన ఆడిషన్ చూసిన తర్వాత తమ ఆలోచన పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ కథలోని పాత్రకు సహజత్వం చాలా అవసరమని, అందుకు సాత్విక వంద శాతం సరిపోతుందని భావించి ఆమెనే ఫైనల్ చేసినట్లు అరవింద్ వివరించారు.

సాత్విక నటనపై అల్లు అరవింద్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె నటన చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఒక కొత్త అమ్మాయి ఇంత అద్భుతంగా నటిస్తుందని నేను ఊహించలేదు. భవిష్యత్తులో ఆమె కచ్చితంగా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది. ఆ నమ్మకం నాకు బలంగా ఉంది కాబట్టే, ఈ సినిమా విడుదల కాకముందే నా బ్యానర్‌లో మరో రెండు సినిమాలకు సాత్వికతో అగ్రిమెంట్ చేయించుకున్నాను అని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

సాధారణంగా కొత్త హీరోయిన్ల విషయంలో నిర్మాతలు ఒక సినిమా ఫలితం చూశాకే మరో అవకాశం ఇస్తుంటారు. కానీ అల్లు అరవింద్ లాంటి అనుభవజ్ఞుడైన నిర్మాత, సినిమా రిలీజ్ కాకముందే రెండు సినిమాలకు కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అరవింద్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో, అసలు సాత్విక అంత అద్భుతంగా నటించిందా? అంటూ నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 'ఆకాశంలో ఒక తార' విడుదలయ్యాక సాత్విక టాలీవుడ్‌లో ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.