Chiranjeevi Megastar Success: అందుకే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు...వందలకోట్ల ఆస్తులు లేవు
Chiranjeevi Megastar Success: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆంధ్రా కమల్ హాసన్‌గా పేరు తెచ్చుకున్న అలనాటి నటుడు నరసింహరాజు. జగన్నోహిని వంటి చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.
Chiranjeevi Megastar Success
Chiranjeevi Megastar Success: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆంధ్రా కమల్ హాసన్‌గా పేరు తెచ్చుకున్న అలనాటి నటుడు నరసింహరాజు. జగన్నోహిని వంటి చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా ఆయన ఎదుర్కొన్న పలు పుకార్ల నుంచి నేటితరం నటుల వరకు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కూడా ఆయన తెలియజేసిన తీరు అమోఘం.
చిరంజీవి మెగాస్టార్ ఎందుకు అయ్యారు?
చిరంజీవి మొదటి చిత్రం పునాదిరాళ్లు. ఆ సినిమా సాంగ్స్ రిలీజ్ అయిన తరువాత చిరంజీవిలోని స్పార్క్‌ను గుర్తించానని, తప్పకుండా స్టార్ హీరో అవుతాడని ఆనాడే గుర్తించినట్టు తెలిపారు. "చిరంజీవి నిరంతర శ్రమ, క్రమశిక్షణతో పాటు ఆయనకున్న మంచి మనసు వల్లే ఈ స్థాయికి చేరారు. తోటి వారు బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం చిరంజీవిది. అందుకే ఆయన దక్షిణ భారతదేశంలోనే తిరుగులేని మెగాస్టార్ అయ్యారు" అని కొనియాడారు. తోటి నటుడి విజయాన్ని ఇంత నిష్కల్మషంగా మెచ్చుకోవడం నరసింహరాజు సంస్కారానికి నిదర్శనం.
పుకార్లపై క్లారిటీ.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల గౌరవం
నరసింహరాజు స్టార్‌గా వెలుగొందుతున్న రోజుల్లో తనపై వచ్చిన పుకార్లపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారిపై విమర్శలు చేశానంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి కేవలం నాటి పత్రికల అతి ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉంటాయని అన్నారు. అలాగే తన 'జగన్మోహిని' చిత్రం అప్పట్లో పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి సృష్టించిన రికార్డులను ఆయన గుర్తు చేసుకున్నారు.
కెనడాలో వందల కోట్ల ఆస్తులున్నాయా?
సినీరంగంలో వారసులను తీసుకురావాలని చూస్తుంటే...నరసింహరాజు మాత్రం తన కుమారుడిని సినీ రంగంలోకి కాకుండా ఉద్యోగం, వ్యాపార రంగంలోకి వెళ్లేలా చేశారు. కెనడాలో స్థిరపడమని ఎందకు చెప్పారనే విసయాన్ని కూడా ఆయన పంచుకున్నారు. సినిమాలో గెలుపోటములు అనిశ్చితమని, స్థిరమైన జీవితం ముఖ్యం అన్నదే తన ఉద్దేశమని చెప్పారు. కెనడాలో తనకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయనేది కేవలం భ్రమ అని, అక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్న సమయంలో కొన్నందున కొంత ఆస్తి కలిసి వచ్చిందని వివరించారు. ముఖ్యంగా అక్కడి ఉచిత వైద్యం, విద్య మరియు సామాజిక భద్రత వంటి అంశాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈరోజు తమ కుటుంబం స్థిరంగా ఇబ్బందులు లేకుండా ఉన్నదంటే దానికి కారణం ముందుచూపుతో కెనడాలో ఆస్తులు కొనుగోలు చేయడమేనని తెలిపారు.




