మహేష్ బాబుతో సినిమా తీయాలని త్రివిక్రమ్‌కు అడ్వాన్స్ ఇచ్చా.. కానీ.! ఓపెన్‌గా చెప్పిన నిర్మాత

MS Raju: ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్‌ని శాసించిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు.. మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్లు సూపర్ స్టార్లు అయ్యాక వారితో సినిమాలు ఎందుకు చేయలేదో తెలుసా?

Ravi
By Ravi
Published on: 31 May 2026 1:10 PM IST
MS Raju
X

మహేష్ బాబుతో సినిమా తీయాలని త్రివిక్రమ్‌కు అడ్వాన్స్ ఇచ్చా.. కానీ.! ఓపెన్‌గా చెప్పిన నిర్మాత

MS Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎం.ఎస్. రాజు పేరు ఒక బ్రాండ్. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తూ, సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన గత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. అయితే, ఆయన మళ్ళీ పాత ఎం.ఎస్. రాజులాగా ఇండస్ట్రీలో ఒక సాలిడ్ హిట్ కొట్టాలని వెంకటేష్, అల్లు అరవింద్ లాంటి ఎంతో మంది సినీ ప్రముఖులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన ఇప్పటి యువ నిర్మాతలు సైతం, తాను మళ్ళీ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారని, ఆ పాజిటివిటీనే తనను ముందుకు నడిపిస్తోందని ఆయన ఎమోషనల్‌గా చెప్పారు.

మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్ళకు కెరీర్ బిగినింగ్‌లో 'ఒక్కడు', 'వర్షం' లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఎం.ఎస్. రాజు, వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యాక ఎందుకు సినిమాలు చేయలేదు.? అనే ప్రశ్న చాలామందిలో మెదులుతుంది. గతంలో ఓసారి దర్శకుడు త్రివిక్రమ్‌కు మహేష్ బాబుతో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చానని.. ఆ తర్వాత కథ తనకు నచ్చకపోవడంతో ఆగిపోయిందని ఎం.ఎస్. రాజు చెప్పుకొచ్చారు. దీని వెనుక తనకొక 'సైకలాజికల్ ప్రాబ్లం' లేదా 'ఇన్సెక్యూరిటీ' ఉందని ఆయన చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. ఒక హీరోకి విపరీతమైన స్టార్ డమ్ వచ్చాక, వారి ఇమేజ్‌కి తగ్గట్టుగా తాను కథను రాయగలనా లేదా అనే భయం తనలో మొదలైందని ఆయన అన్నారు.

పెద్ద స్టార్లు కానివారితో అయితే కథను మనకు నచ్చినట్లుగా మలుచుకోవచ్చని, అదే సూపర్ స్టార్లకైతే వారి ఇమేజ్ దాటి కథను కొత్తగా చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా ప్రభాస్‌తో తీసిన 'పౌర్ణమి' సినిమా గురించి ప్రస్తావించారు. వర్షం, ఛత్రపతి లాంటి సినిమాలతో ప్రభాస్ ఇమేజ్ పూర్తిగా మాస్ హీరోగా మారిపోయింది. ఆ సమయంలో పౌర్ణమి లాంటి ఒక విభిన్నమైన సినిమాను ప్రేక్షకులు ఆ స్టార్ డమ్ వల్ల రిసీవ్ చేసుకోలేకపోయారని, సినిమా మంచిదైనా కేవలం ఆ ఇమేజ్ వల్లే అది ఆడలేదని ఎం.ఎస్. రాజు విశ్లేషించారు. స్టార్ డమ్ అనేది ప్రయోగాత్మక కథలకు కొన్నిసార్లు ఎలా అడ్డంకిగా మారుతుందో చెప్పడానికి ఈ సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్.

నిజానికి ఆయన ఫ్లాపుల్లో ఉన్నవాళ్లను కూడా నమ్మి హిట్లు ఇచ్చిన నిర్మాత. దర్శకుడు శోభన్ తీసిన సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, అతని టాలెంట్ మీద నమ్మకంతోనే ప్రభాస్‌తో 'వర్షం' లాంటి బ్లాక్ బస్టర్ తీశారు. ఒక వ్యక్తి టాలెంట్ మాత్రమే తనకు ముఖ్యమని, గత ఫ్లాపులతో సంబంధం లేదని ఆయన ధైర్యంగా చెప్పారు. కథను నమ్ముకునే ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌కి స్టార్ డమ్ కన్నా, ఆ కథలోని ఫీల్ మాత్రమే ముఖ్యం. మహేష్ బాబు 'ఒక్కడు' సినిమా చేసే సమయానికి కూడా ఆయనకు పెద్దగా హిట్లు లేవని, దర్శకుడు గుణశేఖర్‌కి కూడా అప్పటికి హిట్లు లేకపోయినా కథను నమ్మి సినిమా చేశానని ఆయన గుర్తుచేసుకున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story