Brahmotsavam: మహేష్‌ అభిమానులకు ఆ సినిమా పీడకలే..ఎన్టీఆర్‌ వద్దన్నప్పుడే ఆగిపోవాల్సింది

సినీ ప్రపంచంలో ఒక హీరో వదులుకున్న కథ మరొక హీరోకి వరంగా మారడం మనం చూస్తుంటాం. కానీ, కొన్నిసార్లు అది శాపంగా కూడా మారుతుంది.

Balachander
Published on: 14 May 2026 1:26 PM IST
Brahmotsavam: మహేష్‌ అభిమానులకు ఆ సినిమా పీడకలే..ఎన్టీఆర్‌ వద్దన్నప్పుడే ఆగిపోవాల్సింది
X

Brahmotsavam: సినీ ప్రపంచంలో ఒక హీరో వదులుకున్న కథ మరొక హీరోకి వరంగా మారడం మనం చూస్తుంటాం. కానీ, కొన్నిసార్లు అది శాపంగా కూడా మారుతుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో అలాంటి ఒక చేదు జ్ఞాపకం, అభిమానులకు ఇప్పటికీ వణుకు పుట్టించే సినిమా 'బ్రహ్మోత్సవం'. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తొలుత జూనియర్ ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన ఈ కథ, కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు వద్దకు చేరింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బ తీసి, మహేష్ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా మిగిలిపోయింది.

ఎన్టీఆర్ ఎందుకు వదులుకున్నారు?

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి క్లాసిక్ హిట్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఒక భారీ కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. ఈ కథను మొదట ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వినిపించారు. ఎన్టీఆర్‌కు శ్రీకాంత్‌ చెప్పిన లైన్‌ నచ్చినప్పటికీ కథనంలో కొన్ని మార్పులు చేయమని కోరారు. ఎన్టీఆర్‌ కోరిక మేరకు శ్రీకాంత్‌ అడ్డాల సెకండ్‌ వెర్షన్‌ను కూడా రెడీ చేసుకొని తీసుకెళ్లి వినిపించారు. శ్రీకాంత్‌ అడ్డాల కథ ఓ ప్రయోగాత్మకమైన సినిమా. అప్పటికే ఎన్టీఆర్‌ వరస ప్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోసారి రిస్క్‌ చేసి ఇబ్బంది పడటం ఎందుకు అని చెప్పి ఆయన సినిమాను సున్నితంగా తిరస్కరించారు.

మహేష్ బాబు నమ్మకం.. ఫ్యాన్స్ ఆవేదన

మహేష్‌బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బంపర్‌ హిట్‌ కొట్టడంతో... శ్రీకాంత్ అడ్డాలపై అపారమైన నమ్మకంతో మహేష్‌బాబు ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. 2016 మే 20న విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. సుమారు 75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించారు. కానీ, ఫైనల్‌ రన్‌లో ఈ సినిమా సగం కూడా వసూలు చేయలేకపోయింది. ఈ సినిమా ఎంత భారీ ప్లాప్‌ అయిందంటే... సినిమాలో మితిమీరిన పాత్రలు, గందరగోళమైన కథనం వలన అభిమానులు ఇంటర్వెల్‌లోనే లేచి వెళ్లిపోయారంటే అర్థం చేసుకోవాలి. ఇక సోసల్‌ మీడియాలో ఈ సినిమా పేరు ఎత్తితే... ఆ పీడకలని మళ్లీ గుర్తు చేయకండి అంటూ వేడుకుంటున్నారు.

ఒక హీరో వద్దన్నప్పుడు ఆ కథలో ఏదో లోపం ఉందని గ్రహించకపోవడం వల్ల జరిగిన నష్టం ఇది. ఎన్టీఆర్ ఆనాడే ఈ కథను పక్కన పెట్టి తన కెరీర్‌ను కాపాడుకోగా, మహేష్ బాబు మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. సాధారణంగా ప్లాప్‌ సినిమాను ప్రేక్షకులు త్వరగా మర్చిపోతారు. కానీ, 'బ్రహ్మోత్సవం' మాత్రం తనదైన శైలిలో మీమ్స్ రూపంలోనో, ట్రోల్స్ రూపంలోనో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, తెలుగు సినిమా చరిత్రలో ఇదొక 'భయంకరమైన జ్ఞాపకం'. సినిమా రంగంలో కథా ఎంపిక ఎంత ముఖ్యమో చెప్పడానికి 'బ్రహ్మోత్సవం' ఒక నిలువెత్తు సాక్ష్యం. జాతకాలు మారాలన్నా, తలరాతలు మారాలన్నా సరైన కథ పడాల్సిందే! మహేష్‌బాబు చెప్పినట్టుగానే కొడ్తే...దిమ్మతిరిగి మైండ్‌ బ్లాకవ్వాల్సిందే... అప్పుడే ఇండస్ట్రీలు స్టార్‌హోదా నిలబడుతుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story