Rajanala Villain Roles: కోరుకుంటే హీరో అయ్యేవాడు...కానీ విలన్‌గానే స్థిరపడ్డ రాజనాల...ఎందుకంటే
విలన్‌గా ఒకటికాదు రెండు కాదు ఏకంగా 400 సినిమాల్లో నటించి మెప్పిన మహానటుడు రాజనాల. విలన్‌గా ఆయన భయపెట్టిన తీరును ఈ లోకం ఎన్నటికీ మర్చిపోదు.
Rajanala Villain Roles: ఒక సినిమాను ప్రేక్షకులు చూపుతిప్పుకోకుండా చూడాలంటే హీరో పాత్ర ఎంత బలంగా ఉండాలో...అంతకంటే బలంగా విలన్ పాత్ర ఉండాలి. హీరోకు పోటీగా విలన్ పాత్రలు ఉన్నప్పుడే ఆ సినిమా పండుతుంది. ప్రేక్షకుల చప్పట్లో సినిమా బంపర్ హిట్ అవుతుంది. కథకు తగ్గట్టుగా నటుల ఎంపిక ఎంతో కీలకం. విలన్ అంటే మనకు గుర్తుకు వచ్చే పేరు రాజనాల. ఆయన ముఖంలో కనిపించే కౄరత్వం, విషపు నవ్వు, భీకరమైన కుట్రలు, పన్నాగాలు, నువ్వెంత అన్నట్టుగా ఆయన చూసే చూపులు... అంతలోనే వెటకారంతో పండించే నవ్వులు...అంతకు మించిన హావభావాలు... ఇవన్ని ఆయన సొంతం. కెమెరా ముందుకు రాగానే రాజీలేకుండా పాత్రకోసం ప్రాణం పెట్టే నటుడు రాజనాల.
వైవిద్యమే విలన్‌గా నిలబెట్టింది
ఆనాటి మధురాలుగా చెప్పుకునే జగదేక వీరుని కథ, గుండమ్మకథ, శ్రీకృష్ణపాండవీయం, బొబ్బిలి యుద్ధం, రాముడు భీముడు, ఎలా ఎన్నో చిత్రాల్లో ఎన్టీఆర్ హీరో అయితే...విలన్ రాజనాలనే. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు ఇలాంటి నీచుడుని ఎదుర్కోవడం హీరోకు సాధ్యమౌతుందా అని ప్రేక్షకులకు సందేహం కలిగేది. ఆ తరువాత సినిమా చూస్తున్నంత సేపు ఏమౌతుందో చూద్దామని సిట్లలో అలానే కూర్చుండిపోయేవారు. అది రాజనాల సొంతం. విలన్‌గా ఆయన ఎన్నో సినిమాలను నిలబెట్టిన దాఖలాలు ఉన్నాయి.
సాటిలేని మేటి విలన్
పాత్ర ఏదైనా కావొచ్చు...అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవడం రాజనాలకు వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా కర్కోటకుడిగా, జిత్తుల మాదిరిగా ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టాయి. కేవలం పౌరాణికాలకే పరిమితం కాలేదు. ఆ తరువాత రోజుల్లో సామాజిక చిత్రాల్లో, క్రైమ్ చిత్రాల్లోనూ నటించి అంతే మెప్పించారు. విలన్‌గా 400 చిత్రాల్లో నటన అంటే సామాన్యమా చెప్పండి. ఎంత గాంభీర్యం ఉన్న విలనైనా కొంతకాలానికి నటన పాతబడిపోతుంది. కానీ, రాజనాల చిత్రాలు పెరిగే కొద్ది నటవిధూషణ పెరుగుతూ వచ్చింది. విలన్‌గా హీరోచేతిలో తన్నులు తినే సమయంలో సగటు ప్రేక్షకుడి ముఖంలో కలిగే ఆనందం చూడాలి. అదేదో నిజంగా మనముందు జరుగుతున్న ఫీలింగ్‌తో ఉంటారు. ఇలాంటి విలన్లు మన తెలుగు సినిమాకు దొరకడం చాలా కష్టం.




