Rajinikanth : రజనీకాంత్‌లా మిగతావారు ఇలా ఎందుకు చేయరు?

రజనీకాంత్‌ తన వయసును దాచకుండా సహజ రూపంలో కనిపించడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇమేజ్ భయం లేకుండా జీవించే సూపర్‌స్టార్ ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

Balachander
Published on: 7 Sept 2026 10:40 AM IST
Rajinikanth : రజనీకాంత్‌లా మిగతావారు ఇలా ఎందుకు చేయరు?
X

Rajinikanth : భారతీయ సినిమా ప్రపంచంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ శైలి అత్యంత విభిన్నమైనది. వెండితెరపై సెకనులో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అపారమైన మేజిక్ ఆయన సొంతం. కానీ తెర వెనుక మాత్రం ఎలాంటి ఆడంబరాలు లేకుండా, బట్టతలతోనే అత్యంత సాధారణంగా తిరగడానికి ఆయన ఏమాత్రం సంకోచించరు. ఇమేజ్ అనే ముసుగును పక్కనపెట్టి, వయస్సును సహజంగా స్వీకరిస్తూనే కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకోవడం ఆయన ప్రత్యేకత.

ఇమేజ్ భయం లేని నిజాయితీ ... కుటుంబ సహకారం

చాలామంది నటులు సమకాలీన వయస్సు కనపడకుండా ఉండటానికి విగ్గులు, మేకప్‌లతో బయటకు వస్తుంటారు. వయస్సు పైబడిందనే నిజం బయటపడితే ఇమేజ్ దెబ్బతింటుందనే భయం వారిలో ఉంటుంది. ఇక, రజనీకాంత్ జీవితం, శరీరం, ఈ జన్మ యొక్క శాశ్వతత్వంపై స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి. అందుకే తరచుగా హిమాలయాలకు వెళ్లి వారం నుంచి కొన్ని రోజులు ధ్యానం చేసి మనశ్శాంతిని పొందుతారు. అంతేకాదు, బయటకు వెళ్లేటప్పుడు సహజ రూపంలో ఉండటానికి ఆయన భార్య, కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఎంతో ఉంది. 'ఇమేజ్ పోతుంది, మేకప్‌తోనే వెళ్లండి' అని వారు ఒత్తిడి చేయకపోవడం వల్ల ఆయన స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు.

నిర్మాతలకు అండగా నిలిచే ఉదారత

చిత్ర పరిశ్రమలో ఏ నటుడికీ లేని మరొక గొప్ప లక్షణం రజనీకాంత్‌లో కనిపిస్తుంది. తాను నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించక రూపాయి నష్టం వచ్చినా, నిర్మాతలను ఆదుకునేందుకు తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అభిమానుల నాడి తెలిసిన నటుడిగా తెరపై వారికి కావలసిన వినోదాన్ని అందిస్తూనే, వ్యక్తిగత జీవితంలో బాధ్యతాయుతమైన మనిషిగా మెలుగుతారు.

మానవ నైజం ... వయస్సు తాపత్రయం

మనుషులలో ఒక సాధారణ మానసిక తత్వం ఉంటుంది. పిల్లలకు త్వరగా పెద్దవారైపోవాలనే ఆరాటం ఉంటుంది. అందుకే చిన్నప్పుడే బాలికలు లంగాఓణీలు, చీరలు ధరించి ఆడుకుంటారు. అటు మగపిల్లలు కూడా పెద్దవాళ్లు ధరించే లుంగీలు ధరించడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ, 50 లేదా 60 ఏళ్లు దాటిన తర్వాత పురుషులు తాము ఇంకా యువకులుగానే కనిపించాలని తాపత్రయపడతారు. జీన్స్ ప్యాంట్లు, జుట్టుకు రంగులు వేస్తూ నవయువకుల్లా కనిపించే ప్రయత్నం చేస్తారు. మహిళలు కూడా తాము ఎప్పటికీ యువతుల్లాగే ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తరహా కృత్రిమమైన ఆలోచనలకు దూరంగా ఉంటూ, నిజాయితీగా జీవించడమే రజనీకాంత్‌ను మిగతా నటుల కంటే భిన్నంగా నిలబెడుతోంది. సినిమాల్లో ఎలా కనిపించినా...నిజ జీవితంలో తన వయసును దాచకుండా ఉండేందుకు రజనీకాంత్‌ ఎప్పుడూ ముందు ఉంటాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story