Tollywood: అప్పుడు ఫస్ట్ మూవీ ఆపేయాలనుకున్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..
Tollywood: ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Tollywood: అప్పుడు ఫస్ట్ మూవీ ఆపేయాలనుకున్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..
Tollywood: టాలీవుడ్ ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక సంచలన విషయాలను వెల్లడించారు. అప్పట్లో అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేస్తూ తాను రాసిన 'గంగోత్రి' కథ వెనుక ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మెగాస్టార్ కుటుంబం నుండి ఒక కొత్త హీరోను పరిచయం చేయడం అంత తేలికైన విషయం కాదని, ఆ సమయంలో కొందరు ఆ ప్రాజెక్ట్‌ను ఆపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అయితే అన్ని అడ్డంకులను ఎదుర్కొని తాను గట్టిగా నిలబడి ఆ సినిమాను విజయవంతంగా పూర్తి చేశానని, ఆ అనుభవాలను త్వరలో తాను రాబోయే పుస్తకంలో మరింత స్పష్టంగా వెల్లడిస్తానని ఆయన చెప్పారు.
ఇదేసందర్భంగా దర్శకుడు ఓంకార్ గురించి మాట్లాడుతూ, ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఓంకార్ చాలా మంచి వ్యక్తిత్వమున్న వ్యక్తి అని స్పష్టం చేశారు. ఓంకార్ తెరకెక్కించిన ఒక సినిమాకు తాను కథ అందించానని, ఆ కథాంశం అత్యంత గొప్పదని అయితే దానిని తెరపై ఆశించిన స్థాయిలో పూర్తిగా చూపించలేకపోవడంతో కొంత అసంతృప్తి మిగిలిందని తెలిపారు. అయినప్పటికీ ఓంకార్ భవిష్యత్తులో మరింత గొప్ప దర్శకుడిగా ఎదుగుతాడని, తమ మధ్య మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు.
కాగా, తన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువుల గురించి చెబుతూ చిన్ని కృష్ణ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రముఖ రచయిత సుజాత రంగరాజన్, లెజెండరీ దర్శకుడు భాగ్యరాజు వద్ద తాను శిష్యుడిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. చెన్నైలో ఉన్న సమయంలో భాగ్యరాజు గారికి సేవ చేయడం, ఆయన దగ్గర స్క్రీన్ ప్లే మెలకువలు నేర్చుకోవడం తన జీవితంలో మరువలేని భాగమని చెప్పారు. గురువుల ఆశీస్సులు, అమ్మవారి కృప వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని, నిజ జీవితంలో గురువుల స్థానం దైవంతో సమానమని చిన్ని కృష్ణ భావోద్వేగంగా పంచుకున్నారు.




