Yash : రష్మిక వివాదంపై యశ్ షాకింగ్ కామెంట్స్.!
Yash : కన్నడ స్టార్ హీరో, 'కెజియఫ్' ఫేమ్ యశ్ గతంలో నటి రష్మిక మందన్నతో చోటుచేసుకున్న పాత వివాదంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజత్ శర్మ
yash-rashmika
Yash : కన్నడ స్టార్ హీరో, 'కెజియఫ్' ఫేమ్ యశ్ గతంలో నటి రష్మిక మందన్నతో చోటుచేసుకున్న పాత వివాదంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజత్ శర్మ నిర్వహించిన ప్రముఖ టాక్ షో 'ఆప్ కీ అదాలత్'లో పాల్గొన్న ఆయన, తన రాబోయే చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' విశేషాలతో పాటు ఈ పాత సంఘటనపై తన దృక్పథాన్ని పంచుకున్నారు.
2017లో రష్మిక వ్యాఖ్యలు.. రచ్చకెక్కిన వివాదం
ఈ వివాదం 2017 నాటి ఒక టెలివిజన్ ఇంటర్వ్యూకు సంబంధించినది. రష్మిక మందన్న నటించిన 'కిరిక్ పార్టీ' సినిమా విడుదల సమయానికి ముందు రికార్డు చేసిన ఒక టాక్ షోలో, రాపిడ్ ఫైర్ రౌండ్‌లో కన్నడ ఇండస్ట్రీలో "మిస్టర్ షోఆఫ్" ఎవరు అని యాంకర్ అడిగారు. దానికి రష్మిక, యశ్ పేరును సరదాగా సమాధానంగా చెప్పారు. ఆ తర్వాత ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో యశ్ అభిమానులు రష్మికపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై కన్నడ చిత్ర పరిశ్రమలోని పలువురు దర్శకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
యశ్ స్పందన: "ఎవరి అభిప్రాయమో నా వ్యక్తిత్వాన్ని మార్చదు"
ఈ వివాదంపై 'ఆప్ కీ అదాలత్' షోలో యశ్ మాట్లాడుతూ.. "ఆమె ఏ ఉద్దేశంతో అనిందో నాకు తెలియదు. అప్పటికి ఆమె పరిశ్రమకు కొత్త. ఇలాంటి టీవీ షోలలో కొన్ని 'బక్వాస్' ఆప్షన్లు ఇస్తుంటారు, ఏదో ఒక ఆప్షన్ సరిపోతుందని ఆమె అనుకుని ఉండవచ్చు. దీనిపై చాలామంది దర్శకులు అసహనం వ్యక్తం చేశారు. కానీ నేను వ్యక్తిగతంగా అది ఒకరి అభిప్రాయం మాత్రమే అని భావిస్తాను. ఎవరైనా నాపై ఒక అభిప్రాయం కలిగి ఉండవచ్చు, కానీ ఇతరుల అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని మార్చలేదు. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను" అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, వేరే నటులను కించపరిచేవారు తన అభిమానులు కాదని యశ్ స్పష్టం చేశారు. "మీరు మరొక నటుడిని గౌరవించకపోతే, మీరు నా అభిమాని ఎంతమాత్రం కాదు" అని అభిమానులకు హితవు పలికారు.
నాడే వివరణ ఇచ్చిన రష్మిక.. సర్దిచెప్పిన యశ్
నాటి వివాదంపై రష్మిక స్పందిస్తూ.. అది కేవలం ఒక సరదా రాపిడ్ ఫైర్ గేమ్‌లో భాగంగా ఇచ్చిన సమాధానమని, సంభాషణలో నుంచి రెండు ముక్కలు కట్ చేసి వివాదాస్పదం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు యశ్ సర్ అంటే ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని స్పష్టం చేశారు. అప్పట్లోనే యశ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ, "రష్మికతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ ఆమెకు ఒక అభిప్రాయం ఉండే హక్కు ఉంది. దాన్ని గౌరవిద్దాం. ఇతరుల అభిప్రాయాలతో మనం మారిపోము, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి" అని ఫేస్‌బుక్ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం యశ్, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' చిత్రంలో నటిస్తున్నారు.




