Yash: యష్ నెక్స్ట్ మూవీ ఆ తెలుగు డైరెక్టర్‌తోనా..?
Yash: మంచు మనోజ్ 'డేవిడ్ రెడ్డి' చిత్ర దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి, కన్నడ రాకీ భాయ్ యష్‌తో తదుపరి పాన్-ఇండియా సినిమా చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది.
Yash: యష్ నెక్స్ట్ మూవీ ఆ తెలుగు డైరెక్టర్‌తోనా..?
Director Hanuma Reddy: ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ హీరోగా పాన్-ఇండియా రేంజ్లో రూపుదిద్దుకుంటున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి'. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న హనుమ రెడ్డి యక్కంటి. ఈ చిత్రం రిలీజ్ కాకముందే మరొక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా ఏ సాధారణ హీరోతోనో కాకుండా.. కన్నడ 'రాకీ భాయ్', గ్లోబల్ పాన్-ఇండియా స్టార్ యష్‌తో ఆయన తదుపరి సినిమా ఉండబోతోందనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది.
యష్ లాంటి గ్లోబల్ స్టార్‌తో ఒక కొత్త దర్శకుడి పేరు వినిపించగానే ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి ఈ కాంబినేషన్ వైపు మళ్లింది. 'డేవిడ్ రెడ్డి' సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్ మేకింగ్ క్వాలిటీ, భారీ పాన్-ఇండియా స్కేల్ చూసిన తర్వాత.. హనుమ రెడ్డి టాలెంట్‌పై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. 'టాక్సిక్' చిత్రం తర్వాత యష్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే దానిపై ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
అయితే, హనుమ రెడ్డి చెప్పిన ఓ పవర్ ఫుల్ కాన్సెప్ట్ యష్‌కు బాగా నచ్చిందని, మరో బిగ్ స్కేల్ పీరియాడిక్, యాక్షన్ ప్రాజెక్ట్ కోసం వీరిద్దరూ జతకట్టబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రేజీ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు హీరో యష్ కానీ, దర్శకుడు హనుమ రెడ్డి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొందరేమో 'డేవిడ్ రెడ్డి' విజువల్స్, విజువల్ గ్రాండియర్‌పై వస్తున్న హైప్ చూసి పుట్టుకొచ్చిన ఇండస్ట్రీ గాసిప్ అని కొట్టిపారేస్తుంటే మరికొందరేమో ఇందులో నిజం ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అని భావిస్తున్నారు. ఏది ఏమైనా, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.




