Toxic: ‘టాక్సిక్’ ట్విట్టర్ రివ్యూ...అది పెద్ద మైనస్ అంటూ..!
Toxic: యష్ నటించిన 'టాక్సిక్' సినిమాకు ట్విట్టర్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది.
Toxic: ‘టాక్సిక్’ ట్విట్టర్ రివ్యూ...అది పెద్ద మైనస్ అంటూ..!
Toxic: ‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగించుకుని, మాస్ నయా ఐకాన్ యష్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై పాన్-ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ ధరకు హక్కులు కొనుగోలు చేయడం, రెండు ప్రభుత్వాలు టికెట్ రేట్ల పెంపుతో పాటు ఆంధ్రాలో రూ.600 ధరతో స్పెషల్ ప్రీమియర్‌లకు అనుమతించడంతో హంగామా ఆకాశాన్ని తాకింది.
అయితే, ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ప్రేక్షకుల నుంచి ట్విట్టర్(ఎక్స్) వేదికగా పూర్తి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సాంకేతిక ప్రమాణాలు అద్భుతంగా ఉన్నప్పటికీ, కంటెంట్ , ఎమోషన్ పరంగా సినిమా తీవ్రంగా నిరాశపరిచిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ట్విట్టర్ ఆడియన్స్ ఏమంటున్నారంటే..?
ప్రథమార్ధం అంతా లౌడ్‌గా, కేవలం హంగామాతో మాత్రమే సాగిందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. రొమాంటిక్ సీన్, ఆ తర్వాత ఒక ఫైట్... సినిమా అంతా ఇదే టెంప్లేట్‌తో సాగిపోతుందని, అసలైన ఎమోషనల్ కనెక్షన్ ఏమాత్రం కుదరలేదని విమర్శిస్తున్నారు.
కథనంలో స్పష్టమైన ఫ్లో లేకపోవడం వల్ల అసలు తెరపై ఏం జరుగుతుందో అర్థం కాక విసుగు వస్తోందని ట్వీట్లు చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అధికంగా మోకోబాట్‌లను వాడటం వల్ల యాక్షన్ సీక్వెన్సులు కూడా ఆర్టిఫిషియల్‌గా అనిపించాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
తండ్రీ కొడుకులుగా యష్ ద్విపాత్రాభినయం, ఆయన కటౌట్, కియారా అద్వానీ, నయనతారల నటన ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ వర్క్ , తెలుగు డబ్బింగ్ క్వాలిటీ తీవ్ర ఆందోళన కలిగించేలా ఉన్నాయని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
3 గంటల సుదీర్ఘ నిడివి ప్రేక్షకుల ఓపికకు తీవ్ర పరీక్షగా మారిందని చాలామంది అభిప్రాయపడ్డారు. చివరికి సినిమా పూర్తయ్యేసరికి యష్ లాంటి హీరోను ఇలాంటి స్క్రిప్ట్‌తో చూడాల్సి వచ్చినందుకు ఆయనపై జాలి వేస్తోందని ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు.
టెక్నికల్‌గా విజువల్స్ పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పటికీ, వీక్ స్క్రీన్‌ప్లే, ఆత్మ లేని కథనం వల్ల 'టాక్సిక్' ప్రేక్షకులకు పూర్తిస్థాయి సంతృప్తిని అందించలేకపోయిందని తెలుస్తుంది.




