Nandu's World: బిగ్ బాస్‌లోకి యూట్యూబర్ నందన..వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ!

Nandu's World: లండన్ నుంచి వచ్చిన యూట్యూబర్ నందన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ అయ్యారు.

Gagan kumar
Published on: 12 Sept 2026 10:18 AM IST
Nandus World
X

Nandu's World: బిగ్ బాస్‌లోకి యూట్యూబర్ నందన..వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ!

Youtuber Nandana: సోషల్ మీడియాలో 'నందూస్ వరల్డ్' పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నందన పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సుమారు 28 లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో విశేష క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె, సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో మెరిసి వెండితెరపై కూడా సందడి చేసింది. అయితే, ఒక్కసారిగా ఊహించని వివాదం ఆమె చుట్టూ ముసురుకుంది.

నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఆశ చూపించి, తన భర్తతో కలిసి లండన్ వేదికగా నందన లక్షల రూపాయలు వసూలు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆమెపై బాధితులు వరుస కేసులు నమోదు చేయడంతో పోలీసులు తీవ్రంగా పరిగణించి 'లుకౌట్ నోటీసులు' కూడా జారీ చేశారు.

లుకౌట్ నోటీసులు ఉన్నాయని తెలిసి కూడా నందన లండన్ నుంచి ధైర్యంగా ఇండియాకు రావడం, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగుపెట్టగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం చకాచకా జరిగిపోయాయి. అయితే ఆమె ఇండియాకు రావడానికి వెనుక పెద్ద కథే ఉందనే ప్రచారం నడుస్తోంది.

'బిగ్ బాస్ 10' రియాలిటీ షోలో ఆఫర్ రావడం వల్లే ఆమె హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు నందనకు వారానికి సుమారు రూ. 2 లక్షల వరకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది.

ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుండగా, మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న నందనను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపడంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నాయకులు సైతం ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. నందనను బిగ్ బాస్‌లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని నిర్వాహకులకు, షో హోస్ట్ అక్కినేని నాగార్జునకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇన్ని వివాదాలు, రాజకీయ ఒత్తిళ్లు, చట్టపరమైన చిక్కుల మధ్య నిజంగానే నందన వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ 10 హౌస్‌లోకి అడుగుపెడుతుందా? లేక ఆ ఆఫర్ ఊహాగానాలకే పరిమితమవుతుందా? అనేది చూడాల్సి ఉంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.