Chintalapalem: చింతలపాలెంలో కుక్కల దాడి.. 11 మేక పిల్లలు మృతి!

Chintalapalem: చింతలపాలెం మండలం తమ్మారంలో కుక్కల దాడిలో 11 మేక పిల్లలు మృతి చెందడంతో బాధితుడు చిర్ర రాంబాబు యాదవ్ కుటుంబం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది.

Sowmya
Published on: 15 Nov 2026 12:02 PM IST
Chintalapalem
X

Chintalapalem: చింతలపాలెంలో కుక్కల దాడి.. 11 మేక పిల్లలు మృతి!

Chintalapalem: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారం గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ మేక పిల్లలపై దాడి చేయడంతో 11 మేక పిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన చిర్ర రాంబాబు యాదవ్ ఇంటి పక్కన ఉన్న దొడ్డిలో మేక పిల్లలను ఉంచగా, కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి చంపినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

ఉపాధి కోసం అప్పులు చేసి మేకలను కొనుగోలు చేసి వాటి పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రాంబాబు కుటుంబానికి ఈ ఘటన తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. కష్టపడి పెంచుకుంటున్న మేక పిల్లలు ఒకేసారి మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Sowmya

Sowmya