Nalgonda: నల్లగొండ జిల్లా అన్నేపర్తి బెటాలియన్‌లో ఘనంగా బాపూజీ జయంతి!
Nalgonda: నల్లగొండ జిల్లా అన్నేపర్తి 12వ బెటాలియన్ ఆవరణలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. చిత్రపటానికి నివాళులర్పించిన కమాండెంట్ రామకృష్ణ.
Nalgonda: నల్లగొండ జిల్లా అన్నేపర్తి బెటాలియన్‌లో ఘనంగా బాపూజీ జయంతి!
Nalgonda: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన ఉద్యమం, త్యాగాలు చిరస్మరణీయమని 12వ బెటాలియన్ కమాండెంట్ బి.రామకృష్ణ కొనియాడారు. అన్నేపర్తిలోని బెటాలియన్ ఆవరణలో ఆదివారం బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ ప్రజాహక్కుల కోసం బాపూజీ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.




