Kodad: కోదాడలో విషాదం.. లారీ ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి!
Kodad: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు శివారులో మంగళవారం లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 13 ఏళ్ల బాలుడు షేక్ నాగుల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Kodad: కోదాడలో విషాదం.. లారీ ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి!
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని అడ్లూరు గ్రామ శివారులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిబండ గ్రామానికి చెందిన షేక్ నాగుల్ అలియాస్ బబ్బులు (13) సం" ఏడో తరగతి చదువుతున్నాడు. తన స్నేహితుడు గౌతమ్ (14)సం" తో కలిసి ద్విచక్ర వాహనంపై సరదాగా బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో కోదాడ నుంచి మేళ్లచెరువు వైపు వెళ్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగుల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోవడంతో నాగుల్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




