Katepally: బాధితురాలికి రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీ లేఖ అందజేత
Katepally: పెద్ద కొడప్‌గల్ కాటేపల్లిలో సీఎంఆర్ఎఫ్ ₹2.50 లక్షల ఎల్‌ఓసీ లేఖను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ధన్యవాదాలు తెలిపారు.
Katepally: బాధితురాలికి రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీ లేఖ అందజేత
కాటేపల్లి: గ్రామంలో సీఎంఆర్ఎఫ్ రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ లేఖ అందజేత.
పెద్ద కొడప్‌గల్ (కామారెడ్డి )జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశానుసారం పెద్ద కొడప్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యామప్ప పటేల్ కాటేపల్లి గ్రామాన్ని సందర్శించి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) లేఖను లబ్ధిదారురాలు బోధనం విట్టవ్వ కుమారుడు మాజీ సర్పంచ్ బోధనం విఠల్ కు అందజేశారు.
ఈ సందర్భంగా శ్యామప్ప పటేల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బోద్నం విట్టవ్వ అనారోగ్యం తో బాధ పడుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకు రాగా వెంటనే స్పందించి ప్రత్యేక చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరైందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు సీఎం, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి,నాయకులు మల్లప్ప పటేల్,మొహిద్దిన్ పటేల్, మొగులా గౌడ్,గంగా గౌడ్,పెంటన్న,చాంద్ పాషా, చౌటకురి శంకర్, హన్మండ్లు,రాంచందర్, హాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.




