Nalgonda: ఫారం-18 దరఖాస్తుల పరిశీలన ముమ్మరం: కలెక్టర్

Nalgonda: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 6.09 లక్షల ఫారం-18 దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, నవంబర్ 25న ముసాయిదా జాబితా ఇస్తామని అధికారులు తెలిపారు.

Saleem, Nalgonda
Published on: 5 Nov 2026 6:27 PM IST
Nalgonda
X

Nalgonda: ఫారం-18 దరఖాస్తుల పరిశీలన ముమ్మరం: కలెక్టర్

నల్గొండ: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటివరకు వచ్చిన 6,09,357 ఫారం-18 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. గురువారం సీఈవో సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే 2.26 లక్షల ఫారాలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

నవంబరు 25న ముసాయిదా జాబితా ప్రచురించాలని, డూప్లికేషన్ లేకుండా పూర్తి పారదర్శకతతో పరిశీలన ముగించాలని సీఈవో ఆదేశించారు. సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda