Nalgonda: రూ.10 వేల లంచం ఆశించి ఏసీబీ వలలో చిక్కిన వక్ఫ్ బోర్డు అధికారి
Nalgonda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్‌లో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు.
Nalgonda: రూ.10 వేల లంచం ఆశించి ఏసీబీ వలలో చిక్కిన వక్ఫ్ బోర్డు అధికారి
నల్లగొండ: జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు. లంచం తీసుకుంటూ వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
బాధితుడి నుంచి రూ. 10,000 లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్, ఆ మొత్తాన్ని తీసుకునేందుకు మిర్యాలగూడ బస్టాండ్‌ను వేదికగా చేసుకున్నారు.
బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ముందస్తు వ్యూహంతో నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
Next Story




