Suryapet: సూర్యాపేటలో ప్రజా సమస్యల పరిష్కారానికి సర్వోత్తమ్ రెడ్డి చొరవ
Suryapet: సూర్యాపేట తాళ్లగడ్డ ప్రాంతంలోని భూ వివాదంపై ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
Suryapet: సూర్యాపేటలో ప్రజా సమస్యల పరిష్కారానికి సర్వోత్తమ్ రెడ్డి చొరవ
సూర్యాపేట: AICC సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి "ప్రజా దర్బార్" ద్వారా అందిన వినతులపై వెంటనే స్పందించారు. "వినతులు ఇవ్వడం ప్రజల వంతు, పరిష్కరించడం నా వంతు" అని హామీ ఇచ్చి క్షేత్రస్థాయిలోకి వెళ్లారు.
సూర్యాపేట 29వ వార్డు, తాళ్లగడ్డ ప్రాంతం - ప్రభుత్వ మెడికల్ కళాశాల వెనుక ఉన్న వివాదాస్పద భూమిని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసి, స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించి, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నేరుగా సమస్య ఉన్న చోటుకు వచ్చినందుకు బాధితులు సర్వోత్తమ్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలను ఆఫీసులో కాకుండా ప్రజల మధ్యకే వెళ్లి పరిష్కరించే ఈ విధానం "ప్రజా దర్బార్" లక్ష్యాన్ని నెరవేరుస్తోందని ప్రజలు అభిప్రాయపడ్డారు.




