Nalgonda: నల్లగొండలో ఏఐకేఎంఎస్ ధర్నా ఈసీ తొలగింపునకు డిమాండ్!
Nalgonda: నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ ధర్నా. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి విచారణ జరిపించాలని డిమాండ్!
Nalgonda: నల్లగొండలో ఏఐకేఎంఎస్ ధర్నా ఈసీ తొలగింపునకు డిమాండ్!
Nalgonda: నల్లగొండ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించి, ఆయనపై సమగ్ర విచారణ జరిపించాలని అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి, ఉపాధ్యక్షుడు గజ్జి రవి మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్‌ను తక్షణమే రద్దు చేయాలని, ఓటర్ల జాబితా నుంచి పారదర్శకత లేకుండా తొలగించిన 13.41 కోట్ల మంది పౌరుల ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎన్నికల కమిషన్, అధికార పార్టీకి జేబు సంస్థలా మారిందని విమర్శించారు.




